డిమాండ్ ఉన్న యూత్ హీరోలు లేనంత బిజీగా మాస్ మహారాజా డైరీ చాలా టైట్ అయిపోతోంది. డిజాస్టర్లు పడుతున్నా సరే తన స్పీడ్ మాత్రం ఆగడం లేదు. క్రాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఆస్వాదించే లోపు ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ఫలితాలు అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకే ధమాకా మీద ఇంకా ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదు. జింతకు జిజిన్న పాట ఓ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుంది కానీ ఆ తర్వాత వచ్చిన సాంగ్ సోసోగానే వెళ్తోంది. డిసెంబర్ 23 విడుదలకు అట్టే సమయం లేదు. ఇరవై రోజులు ఇట్టే కరిగిపోతాయి. ఆలోగా పబ్లిసిటీ వేగం పెంచి హైప్ పెరిగేలా చూసుకోవాలి.
ఇదిలా ఉంటే రేపు రిలీజ్ కాబోతున్న విష్ణు విశాల్ మట్టి కుస్తీకి రవితేజనే నిర్మాణ భాగస్వామి. పోటీగా ఉన్న హిట్ 2తో పోలిస్తే ఈ డబ్బింగ్ మూవీని మనవాళ్ళు లైట్ తీసుకున్నారని బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ అబ్బో అదిరిపోయిందనే టాక్ వస్తే తప్ప పికప్ ఆశించడం కష్టం. దీని తాలూకు వ్యవహారాలపై మాస్ రాజా ఓ కన్నేసి ఉంచాలి. సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్న వాల్తేర్ వీరయ్య షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. చిరంజీవితో కాంబినేషన్ సీన్లలో రవితేజ పాల్గొంటున్నారు. దీంతో ఈ కాంబినేషన్ భాగం దాదాపుగా పూర్తవుతుందని సమాచారం.
ఆల్రెడీ చిత్రీకరణ దశలో ఉన్న రావణాసుర, ఈగల్ లను వచ్చే ఏడాది తొలి క్వార్ట్రర్ లోనే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. టైగర్ నాగేశ్వరరావు కోసం ప్రత్యేకంగా జుట్టు గెడ్డం పెంచాల్సి ఉంటుంది కాబట్టి ఆలోగా ఇవన్నీ క్లియర్ చేసుకునే ఒత్తిడి రవితేజ మీద ఉంది. మధ్యలో ధమాకా, వాల్తేర్ వీరయ్య ఈవెంట్లు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాలి. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా ఈ వయసులోనూ మాస్ మహారాజా స్పీడ్ చూస్తుంటే ముచ్చటనిపించక మానదు. ఏడాదికి ఒకటి చేయడమే భారంగా ఫీలవుతున్న ట్రెండ్ లో కొందరు కుర్రహీరోలు తనను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on December 1, 2022 11:48 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…