సాధారణ సినిమాల్లో విలన్ ఎవరైనా సరే పెద్ద ఇంపాక్ట్ ఉండదు కానీ మాస్ యాక్షన్ సినిమాల్లో విలనే ముఖ్యం. హీరోని డీ కొట్టే ఆర్టిస్ట్ , దానికి తగిన విలనిజం లేకపోతే ఆడియన్స్ కి కిక్ ఉండదు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న అన్ని కమర్షియల్ యాక్షన్ సినిమాల్లోనూ విలన్ కేరెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. క్రాక్ , అఖండ ఇలా ఏ సినిమా చూసుకున్నా హీరో తో సమానంగా విలన్ పాత్ర కూడా మెప్పించింది.
మెగా స్టార్ వీరయ్య కి సంబంధించి మెగా ఫ్యాన్స్ లో అదే డౌట్ ఉంది. సినిమాలో విలన్ ఎవరు ? కేరెక్టర్ ఎలా ఉండబోతుంది ? అనేది ఎవ్వరికీ తెలియదు. దీంతో మెగా స్టార్ ని అలాగే రవితేజ ని డీ కొట్టే విలన్ ఎవరు ? ఆ కేరెక్టర్ లో నటించిన ఆర్టిస్ట్ ఎవరనే ఆరా తీస్తున్నారు. నిజానికి ఇంత వరకూ విలన్ ఎవరనేది మేకర్స్ చెప్పలేదు. మరో వైపు బాలయ్య సినిమాలో కన్నడ యాక్టర్ విజయ్ దునియా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. తాజాగా విజయ్ దునియా గెటప్ స్టిల్స్ కూడా బయటికొచ్చేశాయి.
ఇక వీరయ్య టీజర్ లో ఓ విలన్ కేరెక్టర్ కనిపించింది కానీ అతను మెయిన్ విలన్ కాదు. బాబీ సింహా కూడా సోలోమన్ గా కనిపించనున్నాడు కానీ అతను కూడా మెయిన్ విలన్ కాదు. మరి వీరయ్య అసలు విలన్ సంగతి చెప్పెదెప్పుడా ? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ట్రైలర్ వచ్చే వరకూ ఈ విషయంపై మేకర్స్ నోరు మెదిపేలా లేరు.
This post was last modified on December 1, 2022 5:56 am
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…