సమంత లేటెస్ట్ మూవీ యశోదకి ఓటీటీ చిక్కు ఎదురైన సంగతి తెలిసిందే. సినిమా ఓటీటీ రిలీజ్ పై కోర్టు స్టే ఇచ్చింది. విషయంలోకి వెళితే సినిమాలో సరోగశి ఫెసిలిటీ హాస్పిటల్ చూపించారు. దానికి ఈవా అనే పేరు పెట్టారు.
ఇదే పేరుతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్ ఉంది. దీంతో హాస్పిటల్ ఎండీ మోహన్ రావు కోర్టులో కేసు వేశారు. తమ హాస్పిటల్ రిపిటేషన్ దెబ్బ తీసేలా సినిమాలో ఈవా పేరు పెట్టారని కేసు ఫైల్ చేశారాయన. దీంతో తీర్పు వచ్చే వరకు ఓటీటీ రిలీజ్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ పై డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ఓటీటీ సంస్థ తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో నిర్మాత ఈవా ఎండీ తో మీటింగ్ పెట్టుకొని సమస్యను క్లియర్ చేసుకున్నారు.
ఓటీటీ వర్షన్ లో ఈవా పేరు తొలగించేందుకు అంగీకరించారు నిర్మాత. అలాగే థియేటర్ వర్షన్ లో మార్పు కి కాస్త సమయం కోరారు. థియేటర్ లో పేరు తీయడం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు మోహన్ రావు ను నిర్మాత టైం అడిగారు. ఈ లోపు ఓటీటీలో సినిమా వచ్చేసే అవకాశం ఉంది. సో యశోద కి చుట్టుకున్న ఇష్యూ క్లియర్ అయిపోయింది. అతి త్వరలోనే సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 29, 2022 3:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…