ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉన్న దిల్ రాజు.. ఒకప్పుడు చిన్న స్థాయి డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన వాడే. తన కుటుంబంలో ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా.. ఈ రంగంలోకి వచ్చి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని నిర్మాతగా స్థిరపడ్డాడు రాజు. ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్న తాను.. సినిమాల్లోకి ఎలా వచ్చానో.. ఆరంభంలో ఎలాంటి దెబ్బలు తిన్నానో.. ఆ తర్వాత ఎలా నిలదొక్కుకున్నానో ఒక ఇంటర్వ్యూలో వివరించాడు రాజు. ఆ కథాకమామిషు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘మా కుటుంబానికి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. మేం ఆటోమొబైల్ వ్యాపారంలో ఉండేవాళ్లం. హైదరాబాద్‌లో ఆ బిజినెస్ బాగానే నడిచింది. ఐతే నా భార్య వాళ్ల బాబాయి డిస్ట్రిబ్యూటర్. హైదరాబాద్‌లో మా బిజినెస్ ఉన్న గ్యాస్ మండీ చుట్టూనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులుండేవి. దీంతో వాళ్ల వ్యవహారాలు గమనిస్తుండేవాడిని. మా భార్య వాళ్ల బాబాయితో ఒక సందర్భంలో మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూషన్లోకి రావడం గురించి అడిగాను. ఆయన వెంటనే ఒక సినిమాకు ఆఫర్ ఉందని చెప్పారు. ఆయన భాగస్వామ్యంతో దాని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. ఐతే తొలి నాలుగేళ్లలో అన్నీ ఫ్లాపులే ఎదురయ్యాయి. సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టుకున్నా కూడా పరిస్తితి మారలేదు. నాలుగేళ్ల వ్యవధిలో కోటి రూపాయల దాకా నష్టపోయాం. 90ల్లో అది చాలా పెద్ద అమౌంట్. ఈ నష్టాలను ఆటోమొబైల్ ఫీల్డులో భర్తీ చేసుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది.
అలాంటి టైంలోనే కాస్ట్యూమ్స్ కృష్ణ గారు ఒక కన్నడ సినిమా క్యాసెట్ ఇచ్చి చూడమన్నారు. అది నచ్చి రీమేక్ చేస్తే వర్కవుట్ అవుతుందని చెప్పాను. చేతుల్లో సరిపడా డబ్బులు లేకపోయినా ఎలాగోలా పోగేసి, రిస్క్ చేసి ఆ సినిమా నైజాం హక్కుల కోసం కట్టాం. ఆ రోజుల్లో ఆ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. నేను రూ.60 లక్షలు పెడితే.. 1.80 కోట్లు వచ్చాయి. పోయిందంతా కూడా వెనక్కి వచ్చింది. ఈ సినిమాతో మేం నిలబడ్డాం. తర్వాత ‘తొలి ప్రేమ’ నైజాం రైట్స్‌తో మా దశ తిరిగింది. 72 లక్షలకు నైజాం హక్కులు తీసుకుంటే ఆ సినిమా 2.8 కోట్లు కలెక్ట్ చేసింది. ఐతే అందరు ప్రేక్షకుల్లాగే మనకు కూడా తొలి రోజు షో పడే వరకు సినిమా ఎలా ఉంటుందో తెలియట్లేదు కదా.. ఇలా ఎంత కాలం రిస్క్ చేస్తాం. మనమే సినిమా తీద్దాం అన్న ఆలోచన వచ్చింది. ‘ఫెళ్ళిపందిరి’ సినిమాతో నా జడ్జిమెంట్ మీద గురి కుదిరింది. తర్వాత కథలు వినడం మొదలుపెట్టి.. ‘దిల్’ సినిమాతో ప్రొడక్షన్లోకి వచ్చాం’’ అని రాజు వివరించాడు.
This post was last modified on November 30, 2022 8:43 am
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…