తమిళ స్టార్ హీరో ధనుష్ దృష్టి ఉన్నట్లుండి తెలుగు మార్కెట్ మీద పడింది. ఆల్రెడీ ‘రఘువరన్ బీటెక్’, ‘తిరు’ లాంటి చిత్రాలతో ఇక్కడ కొంత మేర ఫాలోయింగ్ సంపాదించినప్పటికీ.. కేవలం డబ్బింగ్ సినిమాలతో సరిపెట్టకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను అలరించాలని ఫిక్సయ్యాడు ధనుష్. ఇందులో భాగంగానే టాలీవుడ్ దర్శకులు శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరిలతో సినిమాలు అనౌన్స్ చేశాడు.
ఇందులో ముందు ప్రకటించిన చిత్రం కమ్ములది కాగా.. లేటుగా అనౌన్స్ అయిన వెంకీ అట్లూరి సినిమా ‘సార్’ను ఆల్రెడీ పూర్తి చేసేశాడు. ఆ చిత్రం విడుదలకు కూడా సిద్ధమవుతోంది. దీన్ని పూర్తి చేశాక ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ అనే మరో చిత్రాన్ని ప్రకటించడం.. అతడి కోసం వేరే ప్రాజెక్టులు కూడా లైన్లో ఉండడంతో కమ్ముల సినిమా మీద సందేహాలు నెలకొన్నాయి. సినిమా ప్రకటించాక దాదాపు ఏడాది పాటు దీని గురించి సౌండే లేకపోవడంతో ఈ చిత్రం ఆగిపోయిందేమో అన్న ప్రచారం కూడా నడిచింది.
ఐతే ఊహాగానాలకు చెక్ పెడుతూ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమాకు సోమవారం ప్రారంభోత్సవం జరిపారు. ధనుష్ గుబురు గడ్డంతో సరికొత్త లుక్‌లో కనిపించాడు ఈ వేడుకలో. సంప్రదాయ తమిళ కుర్రాడిలా పంచెకట్టుతో ధనుష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. శేఖర్ కమ్ముల సినిమా సినిమాకూ గ్యాప్ తీసుకోవడం మామూలే. స్క్రిప్టు కోసం ఆయన చాలా టైం తీసుకుంటాడు. ధనుష్ సినిమా తన కెరీర్లోనే అత్యంత పెద్దది, పైగా ద్విభాషా చిత్రం కావడంతో ఆయన ఇంకాస్త ఎక్కువ శ్రద్ధే పెట్టినట్లున్నారు.
మిగతా దర్శకుల్లా మీడియాకు టచ్‌లో ఉంటూ లీక్స్ ఇచ్చే టైపు కాదు ఆయన. అందుకే సినిమా గురించి ఏడాది పాటు సౌండ్ లేదు. సైలెంటుగా స్క్రిప్టు రెడీ చేసి ఇప్పుడు సినిమాకు ప్రారంభోత్సవం జరిపాడు కమ్ముల. ఈ చిత్రంతో పాటు ‘కెప్టెన్ మిల్లర్’ మూవీని సమాంతరంగా పూర్తి చేయబోతున్నాడు ధనుష్. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ధనుష్-కమ్ముల సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 28, 2022 5:31 pm
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు దిగువ సభ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ…
అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత…
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…