ఒక సినిమా చేస్తున్నపుడు.. ఆ కొంత కాలం హీరో హీరోయిన్లు చాలా సన్నిహితంగా మెలగడం.. వాళ్ల మధ్య ఏదో ఉందని ప్రచారాలు జరగడం మామూలే. బాలీవుడ్లో ఇలాంటివి ప్లాన్ చేసి మరీ చేస్తుంటారు.
ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ద్వారా కూడా సినిమాకు పబ్లిసిటీ తేవడం కోసం హీరో హీరోయిన్లు చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటారు. పనిగట్టుకుని మీడియాలో ఇలా గాసిప్ వార్తలు రాయించే సంస్కృతి కూడా ఉందక్కడ.
మన టాలీవుడ్లో కూడా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా.. సాయిధరమ్ తేజ్-రెజీనా కసాండ్రా లాంటి జంటలు బయట కూడా సన్నిహితంగా మెలిగి వాళ్ల మధ్య ఏదో ఉందన్న సందేహాలు రేకెత్తించాయి. ఐతే తర్వాత వీళ్ల కాంబినేషన్లకు తెరపడ్డాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ అగర్వాల్ జోడీ వరుసగా ‘సీత’, ‘కవచం’ సినిమాలు చేసినపుడు వాళ్ల మధ్య ఏదో ఉందన్న సందేహాలు కలిగాయి కానీ.. తర్వాత వాళ్లు కూడా ఎవరికి వారు అన్నట్లే ఉన్నారు. ఇద్దరి గురించి ఎలాంటి వార్తలు రాలేదు. కానీ ఇప్పుడు కాజల్.. ఉన్నట్లుండి బెల్లంకొండ శ్రీనివాస్‌ను మిస్సయిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.
శ్రీనివాస్‌తో షూటింగ్ చేసినప్పటి క్లోజ్ ఫొటో ఒకటి పెట్టి అతణ్ని మిస్సవుతున్నట్లు కాజల్ పేర్కొంది. దీనికి అతను బదులిస్తూ.. తాను కూడా కాజల్‌ను మిస్సవుతున్నానని, కానీ ఇప్పుడు కలవలేని సమయంలో ఇలా అంటే ఎలా అంటూ రొమాంటిగ్గా స్పందించాడు.
వీళ్లిద్దరూ ఏ ఉద్దేశంతో మాట్లాడుకుంటున్నారో ఏమో కానీ.. ఈ టైంలో ఇద్దరూ ఇలాంటి పోస్టులు పెట్టేసరికి జనాలకు రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అని అనుమానిస్తున్నారు.
This post was last modified on July 15, 2020 5:18 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…