బ్లాక్ బస్టర్లను రీ రిలీజ్ చేయడం ఇటీవలి కాలంలో పెద్ద ట్రెండ్ గా మారిపోయింది. ఫ్యాన్స్ కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తూ ఏకంగా కొత్త రిలీజుల రేంజ్లో హంగామా ప్లస్ కలెక్షన్లు ఇస్తున్నారు. సరే ఇవంటే హిట్లు కాబట్టి ఓకే. కానీ అదే పనిగా డిజాస్టర్లను కూడా తిరిగి థియేటర్లకు తీసుకురావడమే వింత పోకడగా మారుతోంది. ఆ మధ్య ప్రభాస్ రెబల్ ను ఇలాగే విడుదల చేస్తే అభిమానులు సైతం పెద్దగా పట్టించుకోలేదు. ఒకటి రెండు సింగల్ స్క్రీన్లలో తప్ప మిగిలిన చోట్ల వచ్చిన రెస్పాన్స్ సోసోనే. బిల్లా కొంచెం మెరుగ్గా ఆడితే అదే పనిగా తీసుకొచ్చినందుకు వర్షం ఇబ్బందుల పడక తప్పలేదు.
ఇప్పుడీ కోవలో రామ్ చరణ్ ఆరెంజ్ కూడా వస్తోందట. నిన్న ఈ మూవీ 12వ యానివర్సరీ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు దాని తాలూకు జ్ఞాపకాలు, పాటలు షేర్ చేసుకుని అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు. దీన్ని మళ్ళీ రిలీజ్ చేస్తే చూస్తామంటూ కొందరు నిర్మాత నాగబాబుకి ట్యాగ్ చేశారు. ఆయనా స్పందించి త్వరలోనే స్పెషల్ అకేషన్ లో ప్లాన్ చేస్తామని హామీ ఇచ్చేశారు. నిజానికి మగధీర తర్వాత ఆరెంజ్ అట్లాంటి ఇట్లాంటి ఫ్లాప్ కాదు. ఇదే నాగబాబు ఒక ఇంటర్వ్యూలో దీని నష్టాలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పడం అప్పట్లో సంచలనం.
హరీష్ జైరాజ్ ఇచ్చిన అద్భుతమైన పాటలు, నేపధ్య సంగీతం ఒక్కటే ఆరెంజ్ కున్న అతి పెద్ద ప్లస్ పాయింట్స్. ఇప్పుడు గొప్పగా ఉందని కల్ట్ క్లాసిక్ అని చెప్పుకుంటున్న ఫాన్సే ఆ టైంలోనే రెండోసారి చూడలేక ఫ్లాప్ చేశారు. ముఖ్యంగా జెనీలియా ఓవర్ యాక్షన్ మీద నెగటివ్ కామెంట్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. యూత్ కి కనెక్ట్ అయిన కొన్ని అంశాలే యుట్యూబ్ లో, ఆన్ లైన్ లో మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి తప్పించి నిజానికి ఆరెంజ్ ఏ కాలంలో చూసినా ఫీలింగ్ లో పెద్ద తేడా ఉండదు. మరి నాగబాబు నిజంగా రీ మాస్టర్ చేయించి ఇస్తారా లేక ఏదో యథాలాపంగా అనేశారా వేచి చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 8:53 am
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…