బాస్ పార్టీ చార్ట్ బస్టర్ అయ్యాక మెగా ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఉత్సాహమొచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ప్రోమో మొదట్లో టెన్షన్ పెట్టినా చివరికి పాట జనంలోకి వెళ్లిపోవడంతో హ్యాపీ అయ్యారు. నెక్స్ట్ రవితేజ పాత్ర ఇంట్రో, ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్ లో షూట్ చేసిన పూనకాలు లోడింగ్ సాంగ్ వచ్చేస్తాయి. ఇవన్నీ డిసెంబర్ రెండో వారంలోపే వదలబోతున్నట్టు సమాచారం. సినిమాకు సంబంధించిన కొన్ని లీక్స్ ఒక్కొకటిగా బయటకి వస్తూ అభిమానుల్లో ఎగ్జై మెంట్ పెంచే దిశగా ఉన్నాయి. అందులో కీలకమైన ఒక ఎపిసోడ్ గురించిన టాక్ అంచనాలు పెంచేలా ఉంది.
ఇందులో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పోర్టులో దందాలు చేసే లోకల్ మాస్ లీడర్. ఈ ఇద్దరి మధ్య క్లాష్ జరిగే సన్నివేశాన్ని ఇంటర్వెల్ గా సెట్ చేశారట దర్శకుడు బాబీ. ఇద్దరూ పరస్పరం చేసుకునే ఛాలెంజులు ఓ రేంజ్ లో గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటాయని వినికిడి. మణిరత్నం ఘర్షణ, బలరామకృష్ణులు టైపులో వీళ్ళు సవతి అన్నదమ్ములుగా నటిస్తున్నారన్న టాక్ ఆల్రెడీ ఉంది. ఇది కూడా వాస్తవమేనట. అయితే మాస్ మహారాజా క్యారెక్టర్ తాలూకు ఎండింగ్ గురించి ట్విస్టు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే పెట్టారు.
విడుదలకు ఇంకో నెలన్నరే ఉన్న నేపథ్యంలో పబ్లిసిటీ వేగాన్ని పెంచాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వీరసింహారెడ్డి కూడా తమ బ్యానరే కావడంతో ఈ రెండు బాలన్స్ చేసుకోవడం మైత్రి అధినేతలకు పెద్ద సవాల్ గా పరిణమించింది. ఇప్పటిదాకా వచ్చింది ఒక్క పాటే కనక పోలికల పరంగా మరీ ఎక్కువ ఇబ్బంది కలగలేదు. ఇకపై కూడా ఇలాగే సాఫీగా ఉంటే ఎలాంటి సమస్య లేదు. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి మొదటి వారంలో హైదరాబాద్ లోనే జరిపేలా ప్లానింగ్ జరుగుతోంది. వీరసింహారెడ్డిది సీమజిల్లాలో ఒక చోట చేయొచ్చు.
This post was last modified on November 27, 2022 11:22 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…