రాఘవేంద్రరావు ఆల్ టైం క్లాసిక్ కమ్ బ్లాక్‌బస్టర్లలో ఒకడైన ‘పెళ్ళిసందడి’ని రీక్రియేట్ చేస్తూ ‘పెళ్ళిసంద-డి’ పేరుతో గత ఏడాది వచ్చిన కొత్త సినిమా చూసి చాలామంది నెత్తీ నోరు బాదుకున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా ఏంటి.. మరీ ఇంత ఔట్ డేటెడ్ డ్రామానా అంటూ సినిమాను తీవ్రంగా విమర్శించారు.
ఐతే కంటెంట్ పరంగా చాలా పేలవం అయినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేసింది. అందుక్కారణం.. అందమైన లీడ్ పెయిర్. శ్రీకాంత్ కొడుకు రోషన్, కొత్తమ్మాయి శ్రీలీల ఆ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వీరి అందం, అభినయం.. పాటలు ప్లస్ అయి ‘పెళ్ళిసంద-డి’ బాగానే ఆడింది. ఈ సినిమాతో రోషన్‌కు కూడా మంచి పేరే వచ్చినప్పటికీ.. కొత్త సినిమా విషయంలో అతను ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. కానీ శ్రీలీల మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా సినిమాలు చేసేస్తోంది. ఆల్రెడీ రవితేజ సరసన ‘ధమాకా’.. బాలయ్యతో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కాక కన్నడలోనూ కొన్ని సినిమాలున్నాయి ఆమెకు.
ఐతే ఇప్పటిదాకా వచ్చిన ఛాన్సులన్నీ ఒకెత్తయితే.. ఇప్పుడు ఆమెను వరించిన మరో అవకాశం ఇంకో ఎత్తు అని టాలీవుడ్ టాక్. శ్రీలీల ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబులో సినిమాలో ఛాన్స్ పట్టేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేయనున్న కొత్త చిత్రంలో పూజా హెగ్డే ఒక కథానాయికగా ఎప్పుడో ఫిక్స్ అయింది.
కొన్నేళ్ల నుంచి త్రివిక్రమ్ ఆస్థాన కథానాయికగా కొనసాగుతోంది పూజా. త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఉండడం కూడా కామన్. ఐతే ఆ పాత్రకు మరీ ప్రాధాన్యం ఉండదు. అయినా సరే.. త్రివిక్రమ్-మహేష్ సినిమాలో అంటే పాత్ర ప్రాధాన్యం చూడకుండా ఎవ్వరైనా ఒప్పేసుకుంటారు.
శ్రీలీల కూడా అలాగే చేసిందని.. ఈ సినిమాకు సంతకం చేసేసిందని అంటున్నారు. తన సినిమాల్లో ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ పెట్టడం.. దానికి సీనియర్ నటీమణుల్ని ఎంచుకోవడం త్రివిక్రమ్‌కు అలవాటు. ఈ సినిమాలోనూ ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నట్లు సమాచారం. డిసెంబరు తొలి వారంలో సెట్స్ మీదికి వెళ్లాల్సిన సినిమా కృష్ణ మరణంతో కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది.
This post was last modified on November 27, 2022 11:08 am
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…