ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా రీమేక్ ల మీద ఫోకస్ పెడుతున్నారు. ఒక భాషలో హిట్టైన ఏ సినిమాను వదిలి పెట్టకుండా అక్కడ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా దిల్ రాజు కూడా అదే పనిలో ఉన్నాడు. ఓ చిన్న సినిమాను రీమేక్ చేసే మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న లవ్ టుడే సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు దిల్ రాజు. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా షేరింగ్ బేస్ మీద రిలీజ్ చేశాడు. సినిమా మీద తమకున్న నమ్మకంతో తమిళ నిర్మాతలు దిల్ రాజుకి అవుట్ రేటుకి ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే ప్రస్తుతం ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటుంది. తొలి రోజు థియేటర్స్ దగ్గర సందడి లేదు కానీ మెల్ల మెల్లగా మౌత్ టాక్ తో బుకింగ్స్ జోరందుకుంటున్నాయి. అవుట్ రేటు కాకుండా షేరింగ్ బేస్ మీదే కాబట్టి దిల్ రాజు కూడా భారీ పబ్లిసిటీ ఏమి ప్లాన్ చేయకుండా కేవలం మౌత్ టాక్ మీదే ఆధారపడి సినిమాను విడుదల చేశారు.
తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. వారితో పాటు దిల్ రాజు కూడా ఈ రీమేక్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వబోతున్నాడట. ప్రస్తుతానికి హీరో ఎవరనేది ఫిక్స్ అవ్వలేదు కానీ ప్రదీప్ రంగనాథన్ కాకుండా హిందీలో క్రేజ్ ఉన్న యంగ్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నారు. దిల్ రాజుకి జెర్సీ , హిట్ సినిమాలను హిందీలో రీమేక్ చేసిన అనుభవం ఉంది కాబట్టి తమిళ నిర్మాతలు కూడా ఈ డీల్ కి ఓకే అనేశారట. మరి హిందీలో రెండు రీమేకులు చేసి బోల్తా పడ్డ దిల్ రాజు ఈ సినిమా అయినా నిర్మాతగా సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on November 27, 2022 9:09 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…