నవంబరు నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్లుగా నడుస్తోంది. టాక్ బాగున్న సినిమాలు కూడా అనుకున్నంతగా ఆడే పరిస్థితి కనిపించడం లేదు. అయినా సరే ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉణ్నాయి. ఈ వారానికి మూడు సినిమాలు థియేటర్లలోకి దిగాయి. అందులో ఒకటి అల్లరి నరేష్ సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కాగా.. మిగతా రెండూ డబ్బింగ్ చిత్రాలైన ‘లవ్ టుడే’, ‘తోడేలు’. ఈ మూడు చిత్రాల్లో బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం చలాయిస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేసిన సినిమా ‘లవ్ టుడే’.
ప్రదీప్ రంగనాథన్ అనే యువ దర్శకుడు తనే లీడ్ రోల్ చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం ఆల్రెడీ తమిళంలో బ్లాక్‌బస్టర్ అయింది. విడుదలైన నాలుగో వారంలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా చూసి ఫిదా అయిపోయిన దిల్ రాజు తెలుగులో ఈ చిత్రాన్ని పెద్ద స్థాయిలో రిలీజ్ చేశాడు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోయినా.. రిలీజ్ తర్వాత సినిమా కచ్చితంగా జోరు చూపిస్తుందని రాజు అంచనా వేశాడు.
రాజు అంచనా వేసినట్లే ‘లవ్ టుడే’ రిలీజ్ రోజు సాయంత్రం నుంచి బలంగా పుంజుకుంది. మార్నింగ్ షోలకు ఆక్యుపెన్సీ ఓ మోస్తరుగా కనిపించింది. ఐతే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, తోడేలు చిత్రాలతో పోలిస్తే ఆ షోలకు కూడా బెటర్ ఆక్యుపెన్సీనే తెచ్చుకుంది ‘లవ్ టుడే’. ఇక పాజిటివ్ టాక్, రివ్యూలు సినిమాకు కలిసొచ్చి సాయంత్రానికి సినిమా దూకుడు పెంచింది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కొత్త సినిమాల కలెక్షన్ల లెక్కలు చూస్తే దేని పరిస్థితి ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది. అక్కడ సుదర్శన్ థియేటర్లో శుక్రవారం సెకండ్ షోకు ‘లవ్ టుడే’ 1.21 లక్షల గ్రాస్ కలెక్ట్ చేయగా.. దేవి థియేటర్లలో ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ 18 వేలకు దగ్గరగా కలెక్షన్లు తెచ్చుకుంది. సంధ్యలో ‘తోడేలు’ చిత్రానికి 15 వేల వసూళ్లు వచ్చాయి. మిగతా రెండు చిత్రాల వసూళ్లు కలిపినా ‘లవ్ టుడే’ వసూళ్లలో నాలుగో వంతు ఉన్నాయంటే ఆ సినిమా దూకుడు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వీకెండ్లో ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్లేలా కనిపిస్తోంది.
This post was last modified on November 26, 2022 3:29 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…