తెలుగులో థియేటర్లను ఎక్కువగా బ్లాక్ చేసుకుంటోందన్న వివాదాన్ని ఎదురుకుంటున్న విజయ్ వారసుడు తమిళ ఒరిజినల్ వెర్షన్ వరిసు స్వంత రాష్ట్రంలో మాత్రం ఇబ్బందులు పడుతున్నట్టు చెన్నై టాక్. అజిత్ తునివుని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్ వారసుడు ఉదయనిధి డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో అధిక శాతం స్క్రీన్లు దానికే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారనే వస్తున్న వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కేటాయింపులకు సంబంధించిన వివరాలు అధికారికంగా బయటికి రాకపోయినా ఫైనల్ లిస్టు చూశాక అభిమానులు షాక్ అవుతారని పంపిణీదారులు ఆఫ్ ది రికార్డు మాట్లాడుకుంటున్నారు.
అజిత్ క్రేజ్ విజయ్ తో సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న అవకాశాన్ని తునివు నిర్మాతలు చాలా తెలివిగా వాడుకుంటున్నారు. ఈ ఇద్దరూ సంక్రాంతి బరిలో పోటీ పడటం ఇదేం కొత్త కాదు. చాలా సార్లు క్లాష్ అయ్యారు. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. వారసుడు నిర్మాత దిల్ రాజుకి ఏపీ తెలంగాణలో బలమైన నెట్ వర్క్ ఉన్నప్పటికీ కోలీవుడ్ లో ఆయనది పైచేయి కాలేదు. థర్డ్ పార్టీ సహాయం తీసుకోవాల్సిందే. కానీ తునివును ఓవర్ టేక్ చేసేలా ఎత్తుగడలు వేసేంత ప్లానింగ్ లేకపోవడంతో ఈ సమస్య వస్తోందట. వరిసుని కూడా ఉదయనిధి తీసుకున్నారని వినికిడి.
మొత్తానికి సీన్ అటు ఇటు రివర్స్ అయ్యేలా ఉంది. విజయ్ కానీ అజిత్ కానీ ఈ వ్యవహారాల గురించి ఎక్కడా మాట్లాడ్డం లేదు. షూటింగులు చివరి దశలో ఉండటం వల్ల ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఒకవేళ ఇక్కడ చెప్పినట్టే జరిగితే మాత్రం తమిళనాడు కంటే ఏపి తెలంగాణలో వారసుడుకి బెటర్ రిలీజ్ దక్కొచ్చు. ఇంకా వీటికి సంబంధించిన టీజర్లు వదల్లేదు. అవి వచ్చాక అంచనాల విషయంలో హెచ్చుతగ్గులు మారిపోయినా ఆశ్చర్యం లేదు. వలిమై టైంలో ఉపయోగించిన స్ట్రాటజీనే తునివుకు వాడబోతున్నారు నిర్మాత బోనీ కపూర్. చూడాలి మరి ఏం జరగనుందో .
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…