అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య ఏ సినిమాకూ ఇవ్వనంత హైప్, ఎలివేషన్ ‘లవ్ టుడే’ అనే తమిళ అనువాద చిత్రానికి ఇచ్చాడు. తమిళంలో ఈ నెల ఆరంభంలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది ఈ చిత్రం. దీన్ని ముందు రీమేక్ చేద్దామని చూసి.. ఆ తర్వాత ఆలోచన మార్చుకుని డబ్ చేసి రిలీజ్ చేశాడు రాజు. థియేటర్లో తమిళ వెర్షన్ చూశాక దీన్ని రీమేక్ చేయడం కరెక్ట్ కాదని.. న్యాయం చేయలేమని అనిపించిందని రాజు వ్యాఖ్యానించాడు.
‘లవ్ టుడే’ తమిళంలో ఎలా అయితే థియేటర్లను షేక్ చేసిందో.. తెలుగులోనూ అలాగే మన ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తొలి రోజు పరిస్థితి ఎలా ఉన్నా.. రెండో రోజుకు సినిమా బలంగా పుంజుకుంటుందని అంచనా వేశాడు. ఈ రోజు సినిమా చూసిన వాళ్లకు రాజు మాటలు నిజమే అనిపిస్తున్నాయి. తొలి రోజు సినిమాకు ఉదయం పెద్దగా ఆక్యుపెన్సీ కనిపించలేదు. కానీ థియేటర్లలో జనం మాత్రం సినిమాను భలే ఎంజాయ్ చేస్తున్నారు.
అప్పుడెప్పుడో ‘జాతి రత్నాలు’ సినిమాకు నవ్వులతో థియేటర్లు షేక్ అయిపోయాయి. అదొక నవ్వుల సెలబ్రేషన్ లాగా కనిపించింది థియేటర్లలో. మళ్లీ ‘లవ్ టుడే’కు అలాంటి రెస్పాన్స్ కనిపిస్తోంది థియేటర్లలో. సినిమాకు రివ్యూలు, టాక్ చాలా బాగుండడంతో రాజు మాటలు నిజమై శనివారానికి సినిమాకు ఆక్యుపెన్సీ పెరుగుతుందని.. థియేటర్లు ఫుల్ అవుతాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్లు.
ఇక సినిమా చూసిన వాళ్లు చాలామంది ఫీలవుతున్నది ఏమంటే.. ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే తేడా కొట్టేది, అనువాదం చేసి రిలీజ్ చేయడమే కరెక్ట్ అని. ఎందుకంటే ఇందులో హీరో ప్రదీప్ స్థానంలో మరొకరిని ఊహించుకోవడం కష్టం. మనలో ఒకడిలా, చాలా మామూలుగా కనిపించే ప్రదీప్‌ను తెలుగులో రీప్లేస్ చేయగలిగే ఆర్టిస్టులు కనిపించరు. మన దగ్గర హీరోలంటే అందంగా ఉండాలని మంచి లుక్స్ ఉన్న కుర్ర హీరో ఎవరినో పెట్టేవారు. అప్పుడు సినిమాలో ఈ ఫీల్ ఉండేది కాదు. ప్రదీప్ లాగా నటించడం.. ఆ పాత్రను పండించడం మరొకరి వల్ల కాదు అనే స్థాయిలో అతను పెర్ఫామ్ చేశాడు. తనే దర్శకుడు కావడం వల్ల కూడా ఈ పాత్రను మరింత అర్థం చేసుకుని నటించాడు. మొత్తంగా సినిమా ఫీల్ చూసుకున్నా.. దీన్ని రీమేక్ చేస్తే వర్కవుట్ అయ్యేది కాదన్నది స్పష్టం.
This post was last modified on November 25, 2022 10:07 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…