ఒకప్పుడు స్వరాల బ్రహ్మ మణిశర్మ దగ్గర నుండి ఒక ఆల్బమ్ వస్తోందంటే.. మ్యూజిక్ లవ్వర్స్ అందరూ ఎంతో ఆనందపడేవారు. చూడాలని ఉంది వంటి సినిమాల తరువాత.. దాదాపు ఆయన మ్యూజిక్ అందించిన ప్రతీ సినిమా సూపర్ హిట్టే. ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. రావోయి చందమామ, వంశీ వంటి ప్రాజెక్టులకు ఆయన అందించిన పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్ హిట్. అటువంటి మణి హవా బాగా తగ్గిపోయింది. ఆయన ఆల్బమ్ వస్తోందంటే మినిమం ఎక్సపెక్టేషన్ కూడా ఉండట్లేదు. ఈ తరుణంలో అసలు మణిశర్మ మైండ్ సెట్ అనే సందేహం చాలామందికే ఉండొచ్చు.
కామెడీతో పాటు కాసినన్ని చురుకైనా ప్రశ్నలతో కూడా అలరిస్తున్న కమెడియన్ ఆలీ.. తాను నిర్వహిస్తున్న ఆలీతో సరదాగా టాక్ షో కోసం ఇప్పుడు గెస్ట్‌గా మణిశర్మని పిలిచాడు. దాదాపు మణి కీబోర్డ్ ప్లేయర్‌గా ఏ.ఆర్.రెహ్మాన్‌తో కలసి ఇళయరాజా దగ్గర పనిచేసిన రోజులనుండి.. అన్నింటి గురించి చర్చించాడు. ఈ టైములో.. ఓ రెండు ప్రశ్నలతో ఆలీ క్లీన్ బౌల్డ్ చేశాడనే చెప్పాలి. ఒకప్పుడు మీ దగ్గర పనిచేసిన తమన్.. ఇప్పుడు టాప్ కంపోజర్ అయిపోయాడు.. తమన్ వచ్చాక మీ మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది కదా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘టైమ్ అంతే’ అని సింపుల్ గా తేల్చేశాడు ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరక్టర్.
అంతే కాకుండా.. పూరి జగన్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం హిట్ మ్యూజిక్ ఇచ్చిన తరువాత.. తదుపరి ‘లైగర్’ కోసం వేరే వాళ్లను పెట్టుకున్నారేంటి అని అడిగితే.. ఏవో కారణాలు ఉంటాయ్ అంటూ మణిశర్మ చెప్పడం ఇప్పుడు ఈ కార్యక్రమం తాలూకు కొత్త ప్రోమోలో చూడొచ్చు. మొత్తానికి చాలా రోజుల తరువాత ఇండస్ట్రీలో తనకున్న ఇమేజ్ గురించి, ప్రస్తుత స్థితిగతుల గురించి ఓపెన్ అవ్వడం కొంతమంది మ్యూజిక్ లవ్వర్స్‌కు బాగా నచ్చుతోంది. ఫుల్ ప్రోగ్రామ్‌లో ఇంకెన్ని సీక్రెట్లో చెప్పేశాడో చూడాలి మరి.
This post was last modified on November 25, 2022 10:20 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…