అందాల రాశి శ్రీయ సరన్.. హీరోయిన్‌గా కెరియర్ ఆల్మోస్ట్ ఓవర్ అనుకున్న తరుణంలో కొన్ని ఓటిటి సినిమాలు చేసింది కాని, అవి కూడా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత లాక్ డౌన్ టైమ్‌లో కామ్‌గా ఒక బేబీకి జన్మనిచ్చి.. స్పెయిన్ లో టైమ్ స్పెండ్ చేసింది. తరువాత ఇండియా వచ్చి తన భర్త ఆండ్రీయ్ మరియు కూతురుతో కలసి ఛలాకీగా బికినీల్లో ఇనస్టాగ్రామ్ పోస్టులు చేస్తూ ఆకట్టుకుంది. దానితో ఇప్పుడు ముంబయ్‌లో ఏ ఈవెంట్ జరిగినా కూడా అక్కడ శ్రీయ చీఫ్ గెస్ట్ అయిపోతోంది.
అయితే ఈ మధ్యన ఎక్కడికి వచ్చినా కూడా.. భర్తతో కలసి ఒక లిప్‌లాక్ ఫోటోకు ఫోజిస్తోంది శ్రీయ. అదేంటమ్మా అంటే.. నా ఇష్టం అనేసింది. ఇదే విషయాన్ని నిన్న ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న శ్రీయను మీడియా అడిగితే.. ఆండ్రీయ్ కల్చర్ లో అలా పబ్లిక్ గా ముద్దుపెట్టుకోకపోతే తప్పు.. కాబట్టి అదే చేస్తున్నాం.. దాంట్లో ఏముంది.. అంటూ సెలవిచ్చిందట. అలా ముద్దులు పెట్టుకోవడం రష్యాలో లేదంటే స్పెయిన్‌లో పెద్ద విషయం కాదు కాని, మన దేశంలో అలాంటి ఆచారం లేదు కదా అంటే మాత్రం.. జవాబు చెప్పకుండా దాటేసిందట. మొత్తానికి శ్రీయ ఇప్పుడు ముద్దులతో హైలైట్ అయిపోతోంది.
అయితే ప్రస్తుతం శ్రీయ చేతిలో భారీ సినిమాలేవీ లేవు. ప్రతీ హిట్ సినిమాలోనూ ఏదో ఒక గెస్ట్ రోల్‌లో కనిపిస్తోంది కాని, అవి కెరియర్‌ను మాత్రం జోష్ లోకి నెట్టలేకపోతున్నాయి. అందుకే ఆమె ఆర్ఆర్ఆర్, దృశ్యం 2 వంటి హిట్ సినిమాల్లో కనిపించినా కూడా.. ఆమెకు పెద్దగా ఉపయోగపడట్లేదనే.. ఇలా గ్లామర్ అండ్ కిసెస్ రూట్ పట్టిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా.. శ్రీయకు తెలుగులోనైనా ఏదన్నా బ్రేక్ వస్తుందేమో ఎవరన్నా బ్రేక్ ఇస్తారేమో చూడాలి. అయినా వయస్సు 40 టచ్ అయ్యాక మెయిన్ లీడ్స్ కష్టమే కాని, క్యారక్టర్ పాత్రలే మంచివి పడితే అమ్మడికి అదే పదివేలు.
This post was last modified on November 25, 2022 10:11 am
ఒకప్పుడు ‘జబర్దస్త్’ కామెడీ షోలో భాగమైన వాళ్లందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ నామమాత్రంగా నడుస్తోంది. ఆ…
ఈసారి మహారాష్ట్ర గడ్డపై కాంగ్రెస్ జెండా స్థిరంగా ఉండేలా చేయాలని కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.…
ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘కంగువ’ ఒకటి. కోలీవుడ్ బాహుబలిగా ఈ సినిమాను…
పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్…
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై చాలా కాలంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యం ఎందుకనేది…