లిబరల్స్, ఇంటలెక్చువల్స్ అని ముద్ర వేయించుకున్న కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో అదే పనిగా నరేంద్ర మోడీ సర్కారును టార్గెట్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే వాళ్లు చేసే కామెంట్లలో సహేతుకంగా అనిపించేవి ఉంటాయి. కొన్ని అతిగా అనిపిస్తాయి. ఐతే ఏ విషయంలో అయినా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఓకే.
కానీ సున్నితమైన విషయాల్లో తలదూర్చి అతిగా అనిపించే కామెంట్లు చేస్తే ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. తప్పయిపోయిందని లెంపలేసుకున్నా కూడా ఫలితం ఉండదు. ఇప్పుడు బాలీవుడ్ నటి రిచా చద్దా పరిస్థితి ఇలాగే తయారైంది. తాజాగా నార్నర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ ఉపేంద్ర ద్వివేది.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సొంతం చేసుకుంటామని, అందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఒక ట్వీట్ చేశారు.
దానికి బదులుగా.. రిచా గాల్వాన్ సేస్ హాయ్ అని ట్వీట్ చేసింది. మామూలుగా ఈ కామెంట్ చూస్తే ఏ పాకిస్థానీనో, చైనీయులో ట్వీట్ చేసి ఉంటారని అనుకుంటాం. ఎందుకంటే గాల్వాన్ వాలీలో చైనా సైనికులతో పోరాడి భారతీయ సైనికులు 28 మంది దాకా ప్రాణాలు వదలడం ఒక చేదు జ్ఞాపకం.
దేశం కోసం అంతమంది సైనికులు వీర మరణం పొందితే దాన్ని గుర్తు చేస్తూ ఇండియన్ ఆర్మీకి కౌంటర్ వేయడం ఎంత దారుణం? అందుకే రిచా మీద ఆ వర్గం ఈ వర్గం అని తేడా లేకుండా అందరూ విరుచుకుపడిపోయారు. ఆమెకు గట్టిగా గడ్డి పెట్టారు. ఐతే తాను చేసింది ఎంత పెద్ద తప్పో గుర్తుకు వచ్చి రిచా తర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. తన తండ్రి, మామ సైన్యంలో పని చేశారని.. దేశభక్తి అనేది తన రక్తంలో ఉందని.. ఎవరైనా బాధించి ఉంటే మన్నించాలని.. ఇలా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది. అయినా కూడా ఆమె మీద నెటిజన్ల దాడి ఆగట్లేదు.
This post was last modified on November 24, 2022 10:43 pm
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…