Movie News

లీక్డ్‌ పిక్‌తో సెన్సేషన్

ఐదేళ్లు దాటిపోయింది ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై. ఇప్పుడు తలుచుకున్నా తెలుగు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది ఆ చిత్రం. దర్శకుడిగా తొలి సినిమాతో సందీప్ రెడ్డి వంగా రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘శివ’ టైంలో రామ్ గోపాల్ వర్మ ఎలా అయితే ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడో.. ‘అర్జున్ రెడ్డి’తో దాదాపు అలాంటి యుఫోరియానే క్రియేట్ చేశాడు సందీప్. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి అక్కడా అద్భుతమైన ఫలితాన్ని రాబట్టాడు.

ఐతే ‘అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్ మూవీ తీసిన సందీప్.. మళ్లీ ఇప్పటిదాకా టాలీవుడ్ వైపు చూడకపోవడమే కొంత నిరాశ కలిగించే విషయం. ‘కబీర్ సింగ్’ కోసం బాగా టైం తీసుకున్న అతను.. ఆ తర్వాత బాలీవుడ్లోనే ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టైంలోనే ప్రకంపనలు రేగాయి. టైటిల్, సినిమా గురించిన ఇంట్రోలో అలాంటి ఇంటెన్సిటీ కనిపించింది.

ఇప్పుడు ‘యానిమల్’ మరోసారి చర్చనీయాంశం అవుతోంది. అందుక్కారణం సినిమా నుంచి లీక్ అయిన ఒక ఆన్ లొకేషన్ ఫొటోనే. మామూలుగా రణబీర్ అంటే చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాడు. అతడి సినిమాలు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. చాలా కొన్ని సినిమాల్లో మాత్రమే రణబీర్ రఫ్‌గా కనిపించాడు. ‘యానిమల్’లో అతను చాలా వయొలెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడని లీక్డ్ ఫొటో చూస్త అర్థమవుతోంది. గుబురు గడ్డం పెంచి.. చాలా రఫ్‌గా కనిపిస్తున్న అతను ఒంటిపై రక్తం మరకలతో వయొలెంట్‌గా కనిపిస్తున్నాడు.

ఈ లుక్ చూస్తే ‘యానిమల్’ అనే టైటిల్‌కు తగ్గట్లే సినిమా ఉండబోతోందని.. సినిమాలో రక్త పాతం బాగానే ఉంటుందని అర్థమవుతోంది. రణబీర్‌‌ను ఇలాంటి లుక్‌లో చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. అలాగే సినిమా విషయంలో ఎగ్జైట్ అవుతున్నారు. ఈ చిత్రానికి సందీప్ దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాణ భాగస్వామి కూడా. రష్మిక, పరిణీతి, అనిల్ కపూర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది.

This post was last modified on November 24, 2022 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

28 minutes ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

9 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

12 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

12 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

13 hours ago