రైటర్‌గా కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి హిట్లు కొట్టి నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు వక్కంతం వంశీ. కానీ ఆ చిత్రం అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. కథల విషయంలో జడ్జిమెంట్ బాగుంటుందని పేరున్న అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో మాత్రం తడబడ్డాడు.
ఐతే నిజానికి ఈ కథ రాసింది అల్లు అర్జున్ కోసం కాదట. జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమానే బన్నీతో చేశాడట వక్కంతం వంశీ. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. నిజానికి వక్కంతం వంశీ దర్శకత్వ అరంగేట్రం చేయాల్సింది తారక్‌తోనే. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఏం జరిగిందో ఏమో ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత బన్నీతో సినిమా ఓకే అయింది.
దీని వెనుక కథను వంశీ వెల్లడించాడు. ముందు నా పేరు సూర్య కథను తారక్ కోసమే రెడీ చేశానని.. ఐతే స్క్రిప్టు దశలో ఎందుకో ఇది ఎన్టీఆర్‌తో వర్కవుట్ కాదేమో అనిపించిందని.. పరస్పర అంగీకారంతోనే ఆ సినిమాను ఆపేశామన్నట్లుగా చెప్పాడు వంశీ. ఐతే ఒక ఫ్రెండు ద్వారా బన్నీ దగ్గరికి ఈ కథ వెళ్లగా అతడికి వెంటనే నచ్చేసి ఈ సినిమాను పట్టాలెక్కించాడని వంశీ తెలిపాడు.
ఈ కథను తనకంటే బన్నీ, అల్లు అరవింద్ ఎక్కువ నమ్మారని అతను చెప్పాడు. నా పేరు సూర్యలో అన్వర్ పాత్ర మీద క్లైమాక్స్ నడపడం చాలామందికి నచ్చలేదని.. ఐతే అల్లు అరవింద్ దానిపై స్పందిస్తూ ఇది రిస్క్ అని చెబుతూనే సినిమాలో బాగానే వర్కవుట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారని.. దీంతో తాను ధైర్యంగా ముందుకెళ్లిపోయానని వంశీ వెల్లడించాడు. నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో తన కెరీర్ ఇబ్బందికరంగా మారిందనే విషయాన్ని వంశీ అంగీకరించాడు.
This post was last modified on November 24, 2022 9:38 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…