అసలు ఎటువంటి సినిమా చేస్తే కింగ్ నాగార్జున తిరిగి ఫామ్‌లోకి వస్తారు? ఫుల్ రొమాన్స్‌తో ‘మన్మథుడు 2’ సినిమా చేస్తే.. ఏజ్ బార్ హీరో ప్రక్కన ఆ చిన్నపిల్ల రకుల్ ఏంటండీ అంటూ విమర్శకులు ఏకి పారేశారు. పైగా సినిమా కూడా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత ‘వైల్డ్ డాగ్’ అంతేకంటే ఘోరంగా బెడసికొట్టింది. మధ్యలో ‘బంగర్రాజు’ ఫర్వాలేదనిపించినా కూడా, మొన్నొచ్చిన ‘ది ఘోస్ట్’ కూడా మొండిచెయ్యే చూపించింది. మరి నాగ్ తక్షణ కర్తవ్యం ఏమంటారు?
నిజానికి తని ఒరువన్ సినిమా తరువాత మోహన్ రాజాతో సినిమా చేద్దాం అనుకున్న నాగార్జున, గాడ్ ఫాదర్ రిజల్ట్ చూశాక ఆ దర్శకుడితో పనిచేయట్లేదని టాక్. అయితే ప్రస్తుతం తానో మసాలా కామెడీ మూవీ చేస్తే బెటర్ అని నాగ్ ఫీలవుతున్నారట. ఈ మధ్యనే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ.. ధమాకా సినిమా కోసం కూడా ధియేటర్లలో టాప్ లేపేసే కామెడీ రాశాడని టాక్ రావడంతో.. అతన్ని పిలిపించి నాగ్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హలోబ్రదర్ తరహా ఏదన్నా సూపర్బ్ మసాలా కామెడీ ఉంటే.. వెంటనే సినిమాను టేకాఫ్ చేసేద్దాం అని చూస్తున్నారట. అయితే ఇక్కడ ఇంకో చిక్కుంది.
నిజానికి తనే స్వయంగా డైరక్టర్ కావాలని ఎప్పటినుండో ప్రసన్న కుమార్ ప్రయత్నిస్తున్నాడు. ఆ మద్యన ఒకటి రెండు సినిమాలు పట్టాలెక్కినా వాటి జాడేంటతో తెలియట్లేదు. అయితే ఈ మధ్యన చాలామంది రైటర్లను డైరక్టర్స్‌గా చేసిన నాగ్.. చివరకు చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు నాగ్ కూడా కామెడీ కావాలి కాని సరైన డైరక్టర్ కూడా కావాలి అంటూ కండిషన్ పెట్టారట. చూద్దాం ఏమవుతుందో!
This post was last modified on November 23, 2022 10:09 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…