Movie News

సమంతా కోసం వంద కోట్ల వెయిటింగ్

అనారోగ్యంతో బాధ పడుతున్నా హాస్పిటల్ నుంచే ప్రమోషన్ చేసిన దానికి ఫలితంగా యశోద రూపంలో సమంతాకు మంచి ఫలితమే దక్కింది. టాక్ కొంచెం మిక్స్డ్ గా వినిపించినప్పటికీ ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద లాభాలతో బయట పడుతోంది. అపోజిషన్ లేకపోవడాన్ని బాగా ఎంజాయ్ చేసిన యశోద ఇంకో వారం పైనే సేఫ్ రన్ కొనసాగించేలా ఉంది. ఇది ఓకే కానీ ఇంతకీ సామ్ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటుందో అంతు చిక్కడం లేదు. త్వరలోనే అనే మాట వినిపిస్తోంది కానీ అది డిసెంబరా లేక వచ్చే ఏడాదా అనేది తేలడం లేదు. డాక్టర్లు చెప్పేదాన్ని బట్టే తుది నిర్ణయం ఉంటుంది.

సామ్ కోసం వంద కోట్ల పెట్టుబడులు మోక్షం పొందడానికి ఎదురు చూస్తున్నాయి. అందులో మొదటిది ఖుషి. ఇంకో ముప్పై రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుందనగా సమంతా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీంతో యూనిట్ అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉంది. హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు కమిటవ్వకుండా ఖుషి ఫినిష్ చేయడం కోసమే ఎదురు చూస్తున్నాడు. అంతా సవ్యంగా జరిగితే 2023 వేసవిలో రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంతలేదన్నా ఖుషి మీద థియేట్రికల్ బిజినెస్ నలభై కోట్ల దాకా జరగొచ్చు. మల్టీ లాంగ్వేజ్ కాబట్టి అదేమంత కష్టం కాదు.

ఇక గుణశేఖర్ శాకుంతలంలో సామ్ భాగం ఎప్పుడో అయిపోయింది కానీ ఆమె వస్తే తప్ప పబ్లిసిటీ మొదలుపెట్టలేరు. యశోద లాగా ఒక వీడియో ఇంటర్వ్యూతో అయిపోయే వ్యవహారం కాదిది. మార్కెట్ ని మించి బడ్జెట్ ఖర్చు పెట్టారు. సో క్రేజ్ రావాలంటే సమంతా బయట కనిపించాలి. దీనికి అన్ని బాషలకు కలిపి అరవై కోట్లకు పైగానే టార్గెట్ పెట్టుకుంది గుణ టీమ్. ఓ రెండు మూడు పోస్టర్లు తప్ప శాకుంతలంకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. కొత్తగా మొదలుపెట్టాల్సిన ప్రాజెక్టుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ముందైతే ఈ రెండు సినిమాలకు రూట్ క్లియర్ అయితే అంతకంటే ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంది.

This post was last modified on November 24, 2022 9:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇలాగైతే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు ఇబ్బందులే..

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…

4 minutes ago

వైసీపీని ఎవ‌రు న‌మ్ముతారు.. రెంటికీ చెడుతోందా..!

వైసీపీ తీరు మార‌లేదు. ఒక‌వైపు.. ఇండియా కూట‌మిలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు…

3 hours ago

బైడెన్ వ‌ర్సెస్ ట్రంప్‌.. న‌లిగిపోతున్న విదేశీయులు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణుల‌ను ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. మ‌రో రెండు మూడు వారాల్లోనే…

11 hours ago

ఆ ఖైదీ జైలు శిక్ష‌ ఫిఫ్టీ-ఫిఫ్టీ.. భార‌త్‌, బ్రిట‌న్ ఒప్పందం!

జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చ‌ర్యం అంద‌రికీ క‌లుగుతుంది. కానీ, ఇది వాస్త‌వం. దీనికి సంబంధించి…

12 hours ago

‘టీడీపీ త‌లుపులు తెరిస్తే.. వైసీపీ ఖాళీ’

ఏపీలో రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే…

13 hours ago