అడివి శేష్ హీరోగా ప్రశాంతి త్రిపురనేని తో కలిసి నాని నిర్మించిన ‘హిట్2’ డిసెంబర్ 2న రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశారు. టీజర్, సాంగ్, ట్రైలర్ అన్ని వదిలేశారు. ఇక మిగిలింది ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే. దానికి సంబంధించి పనులు చకచకా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈవెంట్ కి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం.
ప్రస్తుతం రాజమౌళి అమెరికా టూర్ లో ఉన్నారు. ఆస్కార్ రేస్ లో ఉన్న RRR ను ప్రమోట్ చేసుకుంటూ హాలీవుడ్ డైరెక్టర్స్ ను కలుస్తూ వారి మెప్పు పొందుతున్నాడు. ఈ నెల 29న ఇండియా తిరిగి రానున్నాడు. వచ్చిన వెంటనే నాని కోసం హిట్2 ఈవెంట్ లో పాల్గొంటాడట జక్కన్న. ఇప్పటికే నానికి మాటిచ్చేసి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారని తెలుస్తుంది. రాజమౌళి తో నాని కి ఉన్న రిలేషన్ షిప్ అందరికీ తెలిసిందే. నాని రాజమౌళి కుటుంబంలో ఒకడిలా ఉంటాడు. అలాగే ఈ సినిమా నిర్మాత ప్రశాంతి త్రిపురనేని రాజమౌళి టీంలో ఒకరు.
‘హిట్ ‘ సిరీస్ లో భాగంగా రాబోతున్న హిట్2 పై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి ఇప్పుడు రాజమౌళి రాక తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం. అమెరికా నుండి వచ్చాక రాజమౌళి కనిపించనున్న ఈ ఈవెంట్ లో ఏం మాట్లాడతారో చూడాలి.
This post was last modified on November 23, 2022 3:59 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…