ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన అత్యుత్తమ బయోపిక్స్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ ఒకటని చెప్పొచ్చు. ఇది ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అన్న సంగతి తెలిసిందే. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, అనేక కష్టాలకు ఓర్చి సొంతంగా విమాన యాన సంస్థను నెలకొల్పి, దాన్ని విజయవంతంగా నడిపించే స్థాయికి గోపీనాథ్ ఎదిగిన క్రమాన్ని చాలా హృద్యంగా, మనసులకు హత్తుకునేలా రూపొందించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ అందుకుంది తెలుగమ్మాయి అయిన తమిళ దర్శకురాలు సుధ కొంగర.
ఆమె విజన్‌కు తగ్గట్లు సూర్య అద్భుతంగా ఆ పాత్రను పోషించి మెప్పించాడు. వీరి కలయికలో త్వరలోనే మరో బయోపిక్ రాబోతున్నట్లు తాజా సమాచారం. అది దేశం గర్వించే వ్యాపారవేత్త, మానవతా వాది రతన్ టాటా జీవిత కథ అని వార్తలొస్తుండడం విశేషం.
‘ఆకాశం నీ హద్దురా’ తర్వాత సుధ ఇంకా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేదు. ఒక దశలో అజిత్ హీరోగా ఓ సినిమా ఓకే అయినట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత దాని గురించి కదలిక లేదు. ఆమె మళ్లీ సూర్యతోనే జట్టు కట్టబోతోందని.. ఆయనతో చేయబోయే సినిమా మీదే దీర్ఘ కాలంగా పని చేస్తోందని తెలుస్తోంది. గోపీనాథ్ జీవితాన్ని హృద్యంగా తెరపై చూపించినట్లే.. రతన్ టాటా లైఫ్ స్టోరీని అంతకంటే గొప్పగా తెరకెక్కించడం కోసం సుధ కష్టపడుతోందట.
ఈ చిత్రంలో సూర్యతో పాటు అభిషేక్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడట. మరి అతనేం పాత్ర చేస్తాడో చూడాలి మరి. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సుధ దర్శకత్వంలో తాము సినిమా చేయనున్నట్లు హోంబలె ఫిలిమ్స్ అధినేతలు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం సూర్య వెట్రిమారన్, శివ, బాల చిత్రాలను లైన్లో పెట్టాడు. మరి సుధతో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
This post was last modified on November 23, 2022 3:48 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…