ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుంది. థియేటర్స్ లో ప్రతీ వారం రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతుంటే ఓటీటీ అరడజను సినిమాలు , సిరీస్ లు వస్తున్నాయి. అయితే ఇటివల ఓటీటీ సంస్థలు కొన్ని కండీషన్స్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. అందులో ఆంథాలజీ లు తీసుకోకూడదనే రూల్ పెట్టుకున్నారు. అన్ని సంస్థలు ఈ రూల్ పాటిస్తున్నాయని అనలేం కానీ మెజారిటీ సంస్థలు ఇప్పటికే ఆంథాలజీ స్టోరీస్ చాలానే రిజెక్ట్ చేశాయి. దీనికి కారణం ప్రేక్షకులు తమ ఫ్లాట్ ఫార్మ్ లో ఆంథాలజీ తో సిరీస్ లు చూడకపోవడం సరైన వ్యూస్ దక్కకపోవడం.
అయితే నాని ప్రొడ్యూస్ చేసిన ‘మీట్ క్యూట్’ కూడా ఆంథాలజీనే. ఐదు కథలతో తెరకెక్కిన సిరీస్ ఇది. మరి నాని అతని అక్క ఈ ఆంథాలజీ సిరీస్ తో ఓటీటీ సంస్థ ను ఎలా మెప్పించారు ? అనే సందేహం రిజెక్ట్ అనిపించుకున్న దర్శక నిర్మాతల మనసులో ఉంది. తాజాగా నానిను ఇదే ప్రశ్న అడగ్గా దానికి నేచురల్ స్టార్ సమాధానమిచ్చాడు. షూటింగ్ స్టేజిలోనే సోనీ లివ్ సంస్థ ఈ సిరీస్ కోసం తన అక్క అండ్ టీం పడుతున్న కష్టం చూశారని ముఖ్యంగా తన సిస్టర్ వర్క్ వాళ్లకి బాగా నచ్చేసిందని, రెండు, మూడు ఎపిసోడ్స్ చూశాకే మేము తీసుకుంటామని ముందుకొచ్చారని చెప్పుకున్నాడు. అంతే కాదు మేం కొంటాం అంటే, మేం కొంటాం అన్నారని కూడా నాని అన్నాడు.
అయితే ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. నాని బ్రాండ్ ఈ ఆంథాలజీ సిరీస్ మార్కెటింగ్ కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే అందరికీ పరిచయం ఉన్న ప్యాడింగ్ ఉంది. ఈ రెండు విషయాలు ఓటీటీ దృష్టిలో పెట్టుకొని ఉండొచ్చు. అలాగే నాని సిస్టర్ దీప్తి కూడా తన కంటెంట్ కూడా మెప్పించింది కాబోలు. ఇవన్నీ కలిసొచ్చి ఫైనల్ గా ఆంథాలజీ ప్రేక్షకుల ముందుకొస్తుంది. నాని సిస్టర్ తో పాటు అందరూ ఈ సిరీస్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సిరీస్ కనుక సక్సెస్ అయితే మిగతా ఓటీటీ సంస్థలు కూడా తాము పెట్టుకున్న కండీషన్ తో కూడిన రూల్ పక్కన పెట్టేసి ఆంథాలజీ కథల కోసం చూసే అవకాశం ఉంది.
This post was last modified on November 22, 2022 10:26 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…