ఎన్ని ప్రయోగాలు చేసినా ఎలాంటి విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నా ఆశించిన స్థాయిలో కమర్షియల్ బ్రేక్ దక్కక వెయిటింగ్ లో ఉన్న నాని ఆశలన్నీ దసరా మీదే ఉన్నాయి. కెరీర్లో మొదటిసారి చాలా మాస్ రఫ్ లుక్ లో పుష్ప టైపులో బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ మీద బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ ఉంది. విడుదల తేదీ 2023 మార్చి 30 ఆల్రెడీ లాక్ చేశారు కాబట్టి చేతిలో ఉన్న నాలుగు నెలల సమయం ఉరుకులు పరుగులు మీదే గడిచిపోనుంది. ఇప్పటిదాకా నాని చేసిన వాటిలో ఇదే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోంది. నలభై కోట్ల పైమాటేనని ఇన్ సైడ్ టాక్.
దసరాకు ఇటీవలే బ్రేక్ ఇచ్చారు. అయ్యప్ప మాల వేసుకోవడంతో కొంత కాలం చిత్రీకరణ ఆపేశారు. తిరిగి ఈ వారంలోనే మొదలు పెట్టబోతున్నారు. తిరిగి రాగానే స్టార్ట్ చేద్దామనుకున్నారు కానీ నానికి మరో రెండు అదనపు బాధ్యతలు తోడయ్యాయి. అందులో మొదటిది సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వచ్చిన వెబ్ యాంతాలజి మీట్ క్యూట్ ఈ నెల 25న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీని నిర్మాణ వ్యవహారాలన్నీ సమర్పకుడిగా నాని ప్రత్యక్షంగా చూసుకున్నాడు. అందుకే ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు గట్రా తనే దగ్గరుండి హాజరై ఆడియన్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.
మరోవైపు తాను సోలో ప్రొడ్యూసర్ గా నిర్మించిన హిట్ 2 డిసెంబర్ 2 విడుదల కానుంది. మేజర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత అడవి శేష్ ఇమేజ్ ప్లస్ మార్కెట్ రెండూ పెరిగిన తరుణంలో ఈ సీక్వెల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. శేష్ తో పాటు నాని కూడా పబ్లిసిటీలో భాగమవుతున్నాడు. దసరాకు కొంత జాప్యం జరగడానికి ఇవీ కారణాలే. ఇలా ట్రిపుల్ రోల్ చేస్తున్న నానికి ఈ ఏడాది అంటే సుందరానికి ఫలితం నిరాశ కలిగించగా ఇయర్ ఎండింగ్ ని ఈ రెండు సక్సెస్ చేయడం ద్వారా ముగించాలని ఆశిస్తున్నాడు. ఎలాగూ దసరా అవుట్ ఫుట్ మీద నమ్మకముంది కాబట్టి కొత్త ఏడాదిలో హిట్టు పడుతుందేమో.
This post was last modified on November 22, 2022 11:41 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…