మొదలుపెట్టిన టైంలో బంగారు బాతులా కనిపించి కాసులు కురిపించిన రీ రిలీజుల ట్రెండ్ కాస్తా ఇప్పుడు వట్టిపోయిన గేదెలా మారిపోయింది. కొందరు డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ వల్ల కేవలం అభిమానుల ఎమోషన్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో వరస బెట్టి సినిమాలు దింపడం క్రమంగా తేడా కొడుతోంది. ఆ మధ్య రెబెల్ థియేటర్లలో జనం కనిపించలేదు. తాజాగా బాద్షాకు ఆడియన్స్ రాక కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి. మనల్ని చూసి కోలీవుడ్ జనాలకు ఇదేదో బాగుందే అనే ఆశలు చిగురించాయి. అందులో భాగంగా వాళ్ళు కూడా పాత చిత్రాలను బయటికి తీయడం మొదలుపెట్టారు.
వచ్చే నెల డిసెంబర్ 12 తలైవా రజనీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని బాబాని రీమాస్టర్ చేయించి సరికొత్త సౌండ్ తో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారని చెన్నై అప్డేట్. తెలుగు వెర్షన్ కూడా ఉంటుందట. 2002లో రిలీజైన ఈ బాబా మాములు డిజాస్టర్ కాదు. మొదటి ఆటకే పబ్లిక్ బాబోయ్ అని దండం పెడితే డిస్ట్రిబ్యూటర్లు విపరీతంగా నష్టపోవాల్సి వచ్చింది. దాని భర్తీకే రజని తన పారితోషికంలో సగం మొత్తం వెనక్కు ఇచ్చారనే వార్త అప్పట్లో మీడియాలో మారుమ్రోగిపోయింది. రెహమాన్ సంగీతం కూడా కాపాడలేకపోయింది. దైవత్వానికి కమర్షియల్ టచ్ ఇద్దామని చూసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
అలాంటి కళాఖండం ఇప్పుడు తీసుకురావడం విచిత్రమే. అదేదో బ్లాక్ బస్టర్ నరసింహనో సూపర్ హిట్ అరుణాచలమో సూపర్ క్లాసిక్ బాషానో చేస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కానీ మరీ ఈ బాబా ఏంటని సినీ ప్రేమికులు వాపోతున్నారు. కొందరికి కల్ట్ క్లాసిక్ అనే ఫీలింగ్ ఉండొచ్చు కానీ తమిళనాడులోనే ఓ మోస్తరుగా ఆడిన బాబా బయట రాష్ట్రాల్లో కొట్టిన దెబ్బ చిన్నది కాదు. మరి ఏ కాన్ఫిడెన్స్ తో దీన్ని సిద్ధం చేస్తున్నారో. అయినా ఫ్యానిజం వెర్రితలలు వేసే తమిళనాడులో బాబాని థియేటర్లలో ఎగబడి చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా చాలా ఏళ్ళుగా టీవీ టెలికాస్ట్ జరగలేదు. అది కూడా ఒక కారణమే అయ్యుంటుంది.
This post was last modified on November 21, 2022 10:47 pm
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…