ఒకప్పుడు ఓ చిత్రం ఎన్ని రోజులు ఆడింది.. ఎన్ని కేంద్రాల్లో శత దినోత్సవం, రజతోత్సవం జరుపుకుంది అన్నదాన్ని బట్టే రికార్డులుండేవి. వాటి విషయంలోనే అభిమానులు కొట్టేసుకునేవాళ్లు. కానీ తర్వాత సినిమాల రన్ బాగా తగ్గిపోవడంతో కలెక్షన్లు ప్రామాణికం అయ్యాయి. ఎన్ని రోజులాడిందన్నది కాకుండా.. ఎంత కలెక్ట్ చేసిందనేదానిపై రికార్డులు నడిచాయి. ఐతే కొన్నేళ్లుగా దాన్ని మించి సోషల్ మీడియా రికార్డుల గోల ఎక్కువైపోయింది. టీజర్లు, ట్రైలర్లకు ఎన్ని వ్యూస్, లైక్స్ వచ్చాయనే విషయంలో అభిమానులు కొట్టేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇవన్నీ కాకుండా అభిమానులకు కొత్త పిచ్చి పట్టుకుంది. అదే ట్వీట్ కౌంట్.
తమ హీరోలకు సంబంధించి ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయడం ఈ మధ్య అభిమానులకు ఫ్యాషన్ అయిపోయింది. దానికొక సమయం సందర్భం అని కూడా చూడట్లేదు. ఒక సినిమా రిలీజ్ సందర్భంగానో.. లేదంటే వార్షికోత్సవానికో లేదంటే హీరో పుట్టిన రోజుకో ట్రెండ్ చేస్తే ఒక అర్థం ఉంది. కానీ హీరో పుట్టిన రోజుకు 50, 100 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని ట్రెండ్ చేయడం.. హీరో బర్త్ డే సీడీపీ గురించి హ్యాష్ ట్యాగ్ పెట్టడం.. బర్త్ డే మంత్ అని ట్రెండ్ చేయడం.. ఇలా చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు అభిమానులు.
ఈ గోలలో ఇప్పటిదాకా కొందరు స్టార్ల అభిమానులే ఉన్నారు. వారి వెనుక ఆయా హీరోలు, వారి పీఆర్వోల ప్రోద్బలం కూడా ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలాంటివి అసలు పట్టించుకోని, ఇష్టపడని పవన్ కళ్యాణ్ మీద కూడా తన ఫ్యాన్స్ ఇలాంటి ట్రెండ్స్ కోసం ఉబలాటపడిపోతున్నారు. రెండు నెలల కిందట ‘గబ్బర్ సింగ్’ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ట్రెండ్ చేశారు, రికార్డు కొట్టారు బాగానే ఉంది. కానీ ఇప్పుడు పవన్ పుట్టిన రోజుకు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని హ్యాష్ ట్యాగ్ పెట్టి నిన్నట్నుంచి ట్విట్టర్లో రచ్చ చేస్తున్నారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. కానీ ఇలాంటి వాటితో వీళ్లు సాధించేదేంటన్నది ప్రశ్నార్థకం.
This post was last modified on July 14, 2020 7:47 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…