ఫలానా సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుందనే వార్త ఇప్పుడు సినిమా మీడియాకు స్టాక్ ఆర్టికల్ గా మారింది. న్యూస్ దొరకడం కష్టమయిన టైంలో రోజుకో సినిమా ఓటిటి బాట పడుతోంది అని రాయడం రివాజుగా మారింది. అలాగే రవితేజ సినిమా క్రాక్ కూడా ఓటిటిలో వస్తుందంటూ ప్రచారం మొదలైంది.
అయితే ఈ సినిమా ఓటిటిలో రావాలంటే షూటింగ్ పూర్తి కావాలి కదా? ఇంకా పది రోజుల టాకీతో పాటు, మూడు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. పోనీ పాటలు తగ్గించుకున్నా… టాకీ అయితే పూర్తి చేయక తప్పదుగా. అంటే ఓటిటి రిలీజ్ కోసం రిస్క్ చేసి ఒక రెండు వారాలు షూటింగ్ చేయాలి. ఇప్పటి పరిస్థితులలో అన్ని రోజుల పాటు సెట్స్ కి వెళ్లడం జరిగే పని కాదు కనుక క్రాక్ సంగతి తేలాలంటే మళ్ళీ మాములు పరిస్థితులు రావాలి.
అదే జరిగితే ఇక ఓటిటిలో విడుదల చేయాల్సిన అవసరమే ఉండదు. అందుకే పూర్తయి ఫైనల్ కాపీ సిద్ధమయిన సినిమాలకు మాత్రమే ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వాటిలో వి, రెడ్, ఉప్పెన లాంటి సినిమాలు మాత్రం ఎంతకాలం అయినా వేచి చూసేందుకే సిద్ధపడ్డాయి.
This post was last modified on July 14, 2020 4:35 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…