కొత్త సినిమా రిలీజై థియేటర్లలో సందడి చేస్తున్న టైంలో సీక్వెల్ గురించి చిత్ర బృందం మాట్లాడడం మామూలైపోతోంది ఈ రోజుల్లో. గతంలో చాలామంది ఇలా సీక్వెల్స్ గురించి మాట్లాడి.. సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోగానే సైలెంట్ అయిపోయారు. సినిమా హిట్టయినా సరే.. సీక్వెల్ గురించి ఆలోచించడం కష్టంగా మారిన ఈ రోజుల్లో రిజల్ట్ ఆశించిన మేర రాకుంటే రెండో భాగం చేయడం అసాధ్యమే అవుతుంది.
టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ ‘యశోద’ విషయంలోనూ దర్శకులు హరి-హరీష్ సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. సమంత ఒప్పుకుంటే కచ్చితంగా సీక్వెల్ తీస్తామని ప్రకటించారు. సీక్వెల్ కోసం తమ దగ్గర కథకు సంబంధించి ఐడియా కూడా ఉన్నట్లు, అంతే కాక యశోద మూడో పార్ట్ తీయడానికి కూడా లీడ్ ఇప్పటికే ఆలోచించినట్లు తెలిపారు. తమ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సైతం సీక్వెల్ విషయంలో ఆసక్తితో ఉన్నట్లు వెల్డించారీ దర్శక ద్వయం.
ఐతే ‘సమంత’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంతృప్తికర ఫలితం అయితే అందుకోలేదు. తొలి వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడింది. వరల్డ్ వైడ్ 7-8 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యాయి. ఫుల్ రన్ కలెక్షన్లు రూ.15 కోట్ల లోపే ఉండేలా ఉన్నాయి. ఈ సినిమాకు రూ.22-24 కోట్ల మధ్య థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనట్లే లెక్క.
ఇక సినిమాకు ప్రేక్షకుల నుంచి కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ బాగున్నా అనుకున్నంత బాగా తెరకెక్కించలేదనే అసంతృప్తి వ్యక్తమైంది. కథ పరంగా చూసుకుంటే దీన్ని ఇంతకుమించి సాగదీస్తే బాగుండదనే అనిపిస్తోంది. సమంత కూడా రిస్క్ చేయడానికి రెడీగా లేకపోవచ్చు. కాబట్టి యశోద సీక్వెల్ కార్యరూపం దాల్చడం సందేహమే. ప్రస్తుతానికి పబ్లిసిటీ కోసం, సినిమా థియేట్రికల్ రన్‌ను ఇంకాస్త లాగడానికి ఈ మాట చెప్పినట్లున్నారు.
This post was last modified on November 18, 2022 3:46 pm
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…