ఏంటో ఈ మధ్య కొన్ని సినిమాలకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా దాన్ని కనీసం ఓ వారం రోజుల పాటు హోల్డ్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. గత నెల దసరాకు గాడ్ ఫాదర్ వచ్చినప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. బాలేదని ఎవరూ అనలేదు. కట్ చేస్తే ఇప్పుడది ఏ స్థాయి హిట్టో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నిర్మాత ఓన్ రిలీజని చెప్పాక బయ్యర్ల వైపు నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు. చిరంజీవి మార్కెట్ రేంజ్ లెక్కల్లో చూసుకుంటే ఇది ఫ్లాప్ కిందే పరిగణించాలి. కాకపోతే ఆచార్య కంటే మెరుగ్గా ఉండటం ఫ్యాన్స్ కి ఊరట కలిగించింది.
ఇప్పుడు యశోద వంతు వచ్చింది. దీనికీ అదే సమస్య. సమంతా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా వినిపించింది. ఓసారి నిక్షేపంగా చూడొచ్చని మీడియా సైతం సపోర్ట్ చేసింది. తన అనారోగ్యం గురించి సామ్ ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ ప్రభావం శని ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. కట్ చేస్తే సోమవారం నుంచి చాలా డ్రాప్ కనిపిస్తోంది. దానికి తోడు సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణం జనాల మూడ్ ని పూర్తిగా మార్చేసింది. ఆయన చివరి చూపు తాలూకు టీవీ లైవ్ లు, ప్రముఖుల సందర్శనలను చూడటంతోనే సరిపెడుతున్నారు.
ఈ కారణంగానే నిన్న ఉదయం ఆటలు రద్దయ్యాయి. మొన్న కొన్ని చోట్ల స్వచ్చందంగా బంద్ పాటించారు. ఇవి యశోద వసూళ్ల మీద మరింత ప్రభావం చూపించాయి. ట్రేడ్ టాక్ ప్రకారం యశోదకు పది కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఇంకో కోటిన్నర తెచ్చుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఎలా చూసుకున్నా ఇది భారీ మొత్తమే కానీ ఇంకాస్త పెద్ద రేంజ్ ఆశించారు నిర్మాతలు. అయినప్పటికీ హీరో లేకుండా కేవలం తన ఇమేజ్ మీద ఇంత రాబట్టడం చిన్న విషయం కాదు. ఈ వారంలో లవ్ టుడే వాయిదా పడటం హారర్ థ్రిల్లర్ మసూద తప్ప ఇంకే పోటీ లేకపోవడం యశోదకు ఇంకో వీకెండ్ ని సానుకూలంగా మార్చింది. చూడాలి మరి ఎలా వాడుకుంటుందో.
This post was last modified on November 17, 2022 12:02 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…