పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ ఆడియో ఏది అంటే ముందు వినిపించే పేరు.. ఖుషి. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, జానీ, గుడుంబా శంకర్, తీన్‌మార్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాల ఆడియోలు కూడా సూపర్ హిట్లే.
కానీ ‘ఖుషి’ అన్నింట్లోకి ప్రత్యేకం. అందులో ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. ఇప్పుడు విన్నా కూడా ట్రెండీగా అనిపిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతాయి ఆ పాటలు. మణిశర్మ కెరీర్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్. ఎంతో శ్రద్ధ పెట్టి చేసినట్లుగా అనిపించే ఈ పాటలకు మణిశర్మ చాలా సమయమే తీసుకుని ఉంటాడని అంతా భావిస్తారు.
కానీ ఈ ఆడియో మొత్తం కేవలం మూడు రోజుల్లో రెడీ చేశాడట మణిశర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. తాను కెరీర్లోనే అత్యంత బిజీగా ఉన్న సమయంలో ‘ఖుషి’ సినిమాకు పని చేయాల్సి వచ్చిందని.. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టైం పెట్టుకుని వరుసగా మూడు రోజులు పని చేసి ఈ ఆడియో పూర్తి చేశానని.. అన్ని ట్యూన్లూ ఓకే అయిపోయాయని మణిశర్మ తెలిపారు.
తన కెరీర్లో అత్యంత వేగంగా ఆడియో ఇచ్చిన సినిమాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఇంత తక్కువ టైం తీసుకున్నప్పటికీ.. పాటలు అద్భుతంగా వచ్చాయని, ఆడియో చాలా పెద్ద హిట్టయిందని.. కానీ తన కెరీర్లోనే అత్యంత సమయం తీసుకుని చేసిన ‘మృగరాజు’ ఆడియో మాత్రం అనుకున్నంత స్థాయిలో రీచ్ కాలేదని అన్నారు. ఎంతో కష్టపడి, సమయం తీసుకుని అందులో ఒక్కో పాట చేశామని.. ఆడియో చాలా బాగా వచ్చినప్పటికీ సినిమా ఫ్లాప్ కావడంతో పాటలు ప్రేక్షకులకు చేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on July 14, 2020 2:50 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…