చిరునవ్వుకు చిరునామాగా.. సంతోషానికి కేరాఫ్ అడ్రస్ లాగా కనిపించే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పుట్టెడు దు:ఖంలో మునిగిపోయి ఉన్నాడు. ఇప్పుడందరూ ఆయన్ని చూసి అయ్యో అనుకుంటున్నారు. ఈ ఏడాది మహేష్ చూసిన విషాదాలు అలాంటివి. వయసు మీద తల్లిదండ్రులు ఏదో ఒక దశలో దూరం కావడం ఎవ్వరి జీవితంలోనైనా జరిగేదే. కానీ కేవలం నెలన్నర వ్యవధిలో జన్మనిచ్చిన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం ఏ మనిషికైనా తట్టుకోవడం కష్టమే. ఇదే పెద్ద విషాదం అంటే.. తన తోడబుట్టిన సోదరుడిని సైతం ఈ ఏడాదే కోల్పోయాడు మహేష్. కేవలం పది నెలల వ్యవధిలో ఈ మూడు పెను విషాదాలు చోటు చేసుకున్నాయి.
ఈ ఏడాది జనవరిలో మహేష్ కొవిడ్ బారిన పడి నాలుగ్గోడలకు పరిమితం అయిన సమయంలో ఆయన సోదరుడు రమేష్ బాబు మృతిచెందారు. తన తోడబుట్టిన వాళ్లలో రమేష్‌తోనే మహేష్‌కు అనుబంధం ఎక్కువ అంటారు. మహేష్‌తో కలిసి సినిమాల్లో నటించడమే కాదు.. తాను సినిమాలకు దూరం అయ్యాక మహేష్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడంలో రమేష్ కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిని తక్కువ వయసులోనే కోల్పోవడం.. పైగా కరోనా కారణంగా కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోవడం మహేష్ జీవితంలో అతి పెద్ద విషాదం.
అంతకుముందు ఏడాదే దశాబ్దాల నుంచి తనకు సినిమాల పీఆర్ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే, ఫాదర్ ఫిగర్ లాంటి బీఏ రాజును దూరం చేసుకోవడం మహేష్‌కు షాక్. తర్వాత అన్నయ్యను కూడా కోల్పోవడం గురించి ‘సర్కారు వారి పాట’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్ అయ్యాడు మహేష్. ఇవే పెద్ద విషాదాలు అనుకుంటే నెలన్నర కిందట తనకెంతో ఇష్టమైన తల్లి ఇందిరాదేవిని కోల్పోయాడు. ఆ విషాదం నుంచి తేరుకునేలోపే తండ్రి కృష్ణనూ దూరం చేసుకున్నాడు. మొత్తంగా చూస్తే 2022 సంవత్సరం మహేష్‌కు ఎప్పటికీ మరువలేని తీవ్ర విషాదాన్ని మిగిల్చిందనే చెప్పాలి.
This post was last modified on November 15, 2022 11:52 am
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…