ఓటీటీల్లో ఈ మధ్య ఏ కొత్త సినిమా రిలీజైనా వేర్వేరు భాషల్లో ఆడియో అందుబాటులో ఉంటోంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజయ్యే సినిమాలకు మామూలుగానే ఆయా భాషల ఆడియోను జత చేస్తారు. అలా కాకుండా ఏదో ఒక్క భాషలోనే తెరకెక్కిన సినిమాకు కూడా ఓటీటీలు ప్రత్యేకంగా ఆడియోను జోడిస్తున్నాయి. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో సినిమాను చూసుకునే సౌలభ్యం లభిస్తోంది.
ఐతే థియేటర్లలో కూడా ఇలా మనకు నచ్చిన భాషను సెలక్ట్ చేసుకుని చూసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఈ టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. టాలీవుడ్ లేటెస్ట్ రిలీజ్ యశోదకు ఈ సౌలభ్యం ఉండడం విశేషం. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. ఐతే హిందీలో సినిమా చూడాలంటే హిందీ వెర్షన్ ఆడుతున్న థియేటర్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. తెలుగు వెర్షన్‌కే వెళ్లినా హిందీ ఆడియోతో సినిమా చూడొచ్చు.
ఐతే ఇందుకు హెడ్‌సెట్‌తో పాటు మొబైల్లో సినీ డబ్స్ అనే యాప్ అందుబాటులో ఉండాలి. ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని.. చూడబోతున్న సినిమా, మనం వెళ్లిన థియేటర్, సమయం అన్నీ ఎంటర్ చేసి లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిగ్గా సినిమాకు తగ్గట్లుగా ఆడియో సింక్ అయిపోతుంది. బిగ్ స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తూ.. హెడ్ సెట్‌లో ఆడియో వింటూ మనకు నచ్చిన భాషలోనే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
యశోద సినిమాకు ఈ సౌలభ్యం ఉన్న విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. జనం దీనికి అలవాటు పడితే మున్ముందు ఇది ఒక ట్రెండ్‌గా మారే అవకాశాలు లేకపోలేదు. అది ప్రేక్షకులకు మంచి అనుభవం అవుతుందనడంలో సందేహం లేదు. తమిళ దర్శకులు హరి-హరీష్ కలిసి రూపొందించిన యశోదకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది.
This post was last modified on November 15, 2022 10:24 am
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…