ఈయన సినిమా కథలు మామూలుగానే ఉంటాయ్ గాని, హీరోలను ఎలివేట్ చెయ్యడానికి పేల్చే డైలాగ్స్ మాత్రం టాప్ లేపేస్తాయ్. అందుకే చాలామంది హీరోలకు హరీశ్ శంకర్‌తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని కోరిక ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ సినిమాలు తేడాపడటం.. రీమేక్ సినిమాలు ఆడటం వలన.. చాలామంది స్టార్లు మాత్రం మనోడ్ని రీమేక్ చెయ్యమని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం హరీశ్ చెప్పిన ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే ఒరిజినల్ లైన్‌ను లైక్ చెయ్యడంతో సీన్ మారిపోయింది అనుకున్నారంత.
ఇక పవన్ తో సినిమా అంటే అదెంత లేట్ అవుతుందో అందరికీ తెలిసిందే. అందుకే హరీశ్ ను బాలీవుడ్ పంపేయాలని మైత్రి మూవీ మేకర్స్ చూస్తున్నట్లు టాక్ వచ్చింది. నిజానికి ముంబాయ్ యాడ్ షూట్ కోసం వెళ్ళిన హరీశ్, అటునుంచటే సల్మాన్ ఖాన్‌కు స్టోరీ చెప్పాశాడంటూ చాలా రూమర్లు వచ్చేశాయ్. సరే ఒకవేళ ఆ స్టోరీ ఏమైనా కూడా, అసలు బాలీవుడ్ వెళ్ళడం కరక్టేనా అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తోన్న ప్రశ్న. దీనికో రీజన్ ఉంది.
బాలీవుడ్‌లోనే ఎలాగైనా సినిమా తీయాలని డిసైడైతే.. ఆ సినిమా ఇక్కడ ఎక్కుతుందనే గ్యారంటీ లేదు. ఇప్పటికే 2017లో డిజె దువ్వాడ జగన్నాథం సినిమా తీసిన హరీశ్.. ఆ తరువాత 2019లో గెద్దలకొండ గణేష్ అనే సినిమా మాత్రమే చేశాడు. అంత పెద్ద హిట్టు కొట్టాక కూడా మనోడు ఒరిజినల్ సినిమా చేయలదనే ఫీలింగ్ చాలామందికి కలిగింది. ఇప్పుడు హిందీ సినిమా అని మొదలుపెడితే అది పూర్తయ్యి రిలీజ్ అవ్వడానికి 2024 అయిపోతుంది. అంటే దాదాపు ఐదేళ్లపాటు తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఒరిజినల్ తియ్యకుండా దూరమవుతున్నట్లేగా.
ఆ విధంగా చూసుకుంటే హరీశ్ శంకర్ తన తెలుగు కెరియర్‌ను రిస్క్ చేస్తున్నట్లే అనిపిస్తోంది. నిజానికి ఇక్కడే ఎవరన్నా స్టార్‌హీరోతో వెంటనే సినిమా తీసి మనోడు గట్టిగా హిట్టు కొడితే బాగుంటుందేమో.
This post was last modified on November 15, 2022 10:21 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…