మామూలుగానే తన మీద ఒక చిన్న రూమర్ వచ్చినా కూడా.. మీడియా చాలా చీప్ అంటూ మండిపడుతుంది టెన్నిస్ సంచలనం సానియా మీర్జా. అయితే అమ్మడు టెన్నిస్ నుండి దూరమయ్యాక అస్సలు న్యూస్‌లో లేకుండా పోతోంది. సరిగ్గా ఇదే సమయంలో.. తన పాకిస్తానీ భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకోనుంది అనే వార్త వైరల్ అయిపోయింది. ఈ సమయంలో షోయబ్ కూడా ఒక పాక్ హీరోయిన్‌తో కలసి కనిపించడం, ఆ వార్తలు నిజమనే అందరూ నమ్మారు. కాని సడన్‌గా ఒక ఊర్దూ ఓటిటి యాప్ మాత్రం.. ‘ది మీర్జా మాలిక్ షో’ వస్తోందంటూ ప్రకటన ఇచ్చేసింది.
ఒక ప్రక్కన ఈ ప్రకటనను ఎండార్స్ చేస్తూ అటు షోయబ్ కానీ ఇటు సానియా కాని ఒక్క ట్వీట్ లేదా ఇనస్టాగ్రామ్ పోస్ట్ చేయకపోవడం ఆశ్చర్యకరంగానే ఉన్నా కూడా, అసలు డైవర్స్ అంటూ వార్తలొచ్చాక ఇలా ప్రోగ్రామ్ ఎనౌన్స్‌మెంట్ ఏంటంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంటే జనాల్లో హైప్ క్రియేట్ చేయడానికి సానియానే ఇటువంటి డైవర్స్ రూమర్లను పుట్టించి, దాని చుట్టూ జనమందరూ డిస్కస్ చేసుకుంటున్న తరుణంలో ఈ కొత్త టాక్-షో గురించి పబ్లిసిటీ మొదలుపెట్టిందా అంటూ అవాకులు చివాకులు పేలుతున్నారు నెటిజన్లు. అయితే సానియా ఎంత చేసినా కూడా, ఒక పాకిస్తానీ షో కోసం ఇటువంటి హడావుడి చేస్తుందా అంటూ మరో వర్గం విమర్శిస్తోంది. ఏదేమైనా సానియా సైలెన్స్ మాత్రం డేంజరస్‌గానే ఉంది.
ఒకవేళ సానియా విడాకులు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా.. కెరియర్ పరంగా ప్రస్తుతం ఈమె పెద్దగా చేస్తున్నదేం లేదు. రిటైర్ అయ్యాక క్రికెట్ లవర్స్ చాలామంది సచిన్ టెండుల్కర్‌ను ఆల్మోస్ట్ ఎలా మర్చిపోయారో.. ఇప్పుడు సానియా పరిస్థితి కూడా అంతే. అయితే అటువంటి టాక్ షో లాంటివి ఇండియాలో చేసుకుంటే మాత్రం అమ్మడికి మాంచి పాపులార్టీ వచ్చే ఛాన్సుంది. చూద్దాం ఏమవుతుందో మరి.
This post was last modified on November 15, 2022 10:18 am
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…