ఆల్రెడీ రామ్‌చరణ్ తదుపరి సినిమాపై ఇప్పటివరకు క్లారిటీయే లేదు. RRR వంటి స్టన్నింగ్ బ్లాక్‌బస్టర్ తో ఇండియావైడ్ భారీగా పేరు తెచ్చుకున్న మెగా హీరో.. ఆ తరువాత కేవలం శంకర్ సార్‌తో మాత్రమే సినిమా చేస్తున్నాడు. #RC15 పూర్తయ్యాక అసలు చరణ్ ఎవరితో సినిమా చేస్తాడు? ఒక ప్రక్కన గౌతమ్ తిన్ననూరి సినిమా క్యాన్సిల్ చేశాడు.. మరో ప్రక్కన కన్నడ డైరక్టర్ కు నో అని చెప్పేశాడు.. మరి తదుపరి ఏంటి? అని ఫ్యాన్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్న సమయంలో.. ఇప్పుడు ఒక కామెంట్ తో అందరికీ షాకిచ్చాడు.
ఓ రెండ్రోజుల క్రితం హిందుస్తాన్ టైమ్స్ కాంక్లేవ్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలసి పాల్గొన్న సమయంలో.. తమని సౌత్ హీరోస్ అనొద్దని, ఇండియన్ సినిమా ఇండియన్ హీరోస్ అని పిలవండంటూ చరణ్ క్లాసిచ్చాడు. అంతేకాదు.. తనకు కేవలం తెలుగు డైరక్టర్స్‌తోనే పనిచేయాలని లేదని, గుజరాతీ మరియు బెంగాళీ డైరక్టర్లు కూడా మంచి సినిమాలు తీస్తున్నారని, వారితో పనిచేయాలనుందని సెలవిచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. ఇప్పుడు ఎవరన్నా బెంగాలీ డైరక్టర్ తోఏదన్నా హిందీ సినిమా ఎనౌన్స్ చేస్తాడా అనే సందేహం వచ్చేస్తోంది. కాని తెలుగు సినిమాతో ఇండియావైడ్ హిట్ కొడితే బాగుంటుంది కదా.. మళ్ళీ ఈ బెంగాళీ గుజరాతీ డైరక్టర్స్ ఎందుకు?
ప్రస్తతుం శంకర్ సినిమాలోని పాట చిత్రీకరణకు న్యూజిలాండ్ వెళ్తున్న చరణ్.. వచ్చీరాగానే ఉప్పెన్ డైరక్టర్ బుచ్చిబాబు చెప్పిన ఫైనల్ నెరేషన్ వినేసి.. ఆ సినిమా చేయాల వద్దా అనేది డిసైడ్ అవుతాడట. కాని ఎప్పుడైతే బెంగాళీ డైరక్టర్స్ అంటూ కామెంట్ చేశాడో.. ఇప్పుడు అక్కడి నుండి కూడా చాలామంది దర్శకులు చరణ్‌ను కలవడానికి క్యూ కట్టేసే ఛాన్సుంది. ఏ సినిమా చేసినా త్వరగా చేస్తే బెటర్ అనేది మూవి లవ్వర్స్ సలహా. చూద్దాం చరణ్ ఏం చేస్తాడో!
This post was last modified on November 15, 2022 10:18 am
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…