ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో శివకార్తికేయన్ ప్రిన్స్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ తమిళ్ లో డిజాస్టర్ అనిపించుకుంది. అప్పటి వరకు వరుస సక్సెస్ లతో కొనసాగుతున్న శివకార్తికేయన్ కెరీర్ కి ప్రిన్స్ బ్రేక్ వేసింది. ఓవరాల్ గా ఫ్లాప్ ప్రాజెక్ట్ అయింది. శివ కార్తికేయన్ నమ్మకాన్ని అనుదీప్ నిలబెట్టుకోలేక పోయాడని రిమార్క్ పడింది.
అయితే ఇప్పుడు వెంకీ అట్లూరి వంతు. ధనుష్ హీరోగా వెంకీ ‘సార్’ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో వాతి పేరుతో తెరకెక్కుతున్న ఈ బైలింగ్వల్ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కానీ వెంకీ మీదే అందరికీ డౌట్ కలుగుతుంది. తొలిప్రేమతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ ఆ తర్వాత మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. సో వెంకీకి ఈ సినిమా సక్సెస్ చాలా కీలకం అలాగే ధనుష్ పెట్టుకున్న నమ్మకం కూడా నిలబెట్టుకోవాల్సి ఉంది. విద్యా రంగంలో జరిగే అవినీతిపై జరిగే పోరాటంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వెంకీ అట్లూరి.
మరి టాలీవుడ్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ కి తెలుగు, తమిళ్ లో సాలిడ్ హిట్ ఇస్తాడా ? చూడాలి. వెంకీ తర్వాత ధనుష్ శేఖర్ కమ్ముల తో మరో బైలింగ్వల్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు సంబందించి కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ సినిమా సెట్స్ పైకి రానుంది.
This post was last modified on November 14, 2022 9:22 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…