Movie News

ఓరి దేవుడా.. రూల్స్ వర్తించవా?

కొన్ని నెలల కిందట టాలీవుడ్‌లో జరిగిన స్ట్రైక్ గురించి తెలిసిందే. మామూలుగా సినీ కార్మికులు తమ డిమాండ్లతో షూటింగ్స్ ఆపేంచేయడం చూస్తుంటాం. కానీ ఈ ఆగస్టు నెలలో పెద్ద నిర్మాతలే ఉమ్మడి నిర్ణయంతో షూటింగ్స్‌కు బ్రేకులు వేశారు. తిరోగమనంలో పయనిస్తున్న ఇండస్ట్రీని గాడిన పెట్టాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవంటూ ఆ సమయంలో తమకు తాముగా షూటింగ్స్ ఆపుకుని సమావేశాలు నిర్వహించారు.

ఓటీటీల్లో త్వరత్వరగా కొత్త సినిమాలు రిలీజవుతుండడం వల్ల థియేట్రికల్ కలెక్షన్లు తగ్గిపోతున్నాయని.. తాత్కాలిక ప్రయోజనం గురించి ఆలోచిస్తే.. భవిష్యత్తులో భారీ నష్టాలు తప్పవని భావించి థియేటర్లలో రిలీజైన 50 రోజులకు కానీ కొత్త చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేయకూడదని తీర్మానించారు. గతంలోనూ ఇలాంటి తీర్మానాలు జరిగినప్పటికీ.. ఈసారి కఠినంగా షరతును పాటించేలా నిర్మాతల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లే కనిపించింది. ఈ తీర్మానం జరిగిన టైంలో రిలీజైన బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాల విషయంలో కొంచెం కఠినంగానే ఈ నిబంధన అమలు చేశారు.

సరిగ్గా 50 రోజుల తర్వాత కాకపోయినా ఐదు వారాల తర్వాతే ఈ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఆలస్యంగా వచ్చినా ఈ సినిమాలకు ఓటీటీల్లో మంచి స్పందనే వచ్చింది. వీటి థియేట్రికల్ రన్ కూడా ఎక్కువ రోజులు సాగింది. కానీ ఈ రూల్‌ మిగతా అన్ని సినిమాలకు కూడా మాత్రం వర్తింపజేయలేకపోతున్నారు. దసరా సినిమాల్లో ‘స్వాతిముత్యం’ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది.

‘ది ఘోస్ట్’ కూడా నెల రోజులకే ఓటీటీలో అడుగు పెట్టింది. ఇక దీపావళి సినిమా ‘ఓరి దేవుడా’ అయితే 20 రోజుల్లోపే ఆహాలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రంలో దిల్ రాజు, పీవీపీ లాంటి పెద్ద నిర్మాతలు భాగస్వాములు. ఇలాంటి పెద్ద నిర్మాతలే తాము పెట్టుకున్న రూల్‌ను బ్రేక్ చేసి ఒక పేరున్న సినిమాను ఇంత త్వరగా ఓటీటీలోకి వదిలేస్తే మిగతా ప్రొడ్యూసర్లు ఈ రూల్‌ను ఏం పాటిస్తారనే చర్చ నడుస్తోంది టాలీవుడ్లో.

This post was last modified on November 11, 2022 9:14 am

Share

Recent Posts

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

31 minutes ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

8 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

9 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

9 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

10 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

10 hours ago