కరోనా ముందు ఎంత పెద్ద వాళ్లయినా తల వంచాల్సిందే అని మరోసారి రుజువైంది. బయటికి వెళ్లాల్సిన, ఎవరినీ కలవాల్సిన అవసరమే పడని.. అన్ని జాగ్రత్తలూ తీసుకునే ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సైతం కరోనా బాధితుడిగా మారారు.
ఆయనే కాదు.. కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆద్య సైతం కరోనా బారిన పడ్డారు. వీరి పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా 77 ఏళ్ల వయస్కుడైన అమితాబ్ గురించి టెన్షన్ పడుతున్నారు. ఆయనతో పాటు అభిషేక్ కూడా ముంబయిలో అంబానీ వారి ప్రఖ్యాత కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరికీ పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే ఐశ్వర్య, ఆద్య కూడా కరోనా బారిన పడ్డట్లు వెల్లడైంది. వీళ్లిద్దరూ కూడా ఆసుపత్రికి వెళ్లగా.. వీరికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇంటికే పరిమితం కావాలని వైద్యులు సూచించారు. దీంతో తల్లీకూతుళ్లిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. అక్కడే రెండు వారాల పాటు హోం క్వారంటైన్లో ఉండబోతున్నారు.
అభిషేక్ కూడా ఇంటికి వచ్చేస్తున్నట్లు ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాదని తేలింది. తండ్రితో పాటు తాను కూడా ఆసుపత్రిలో ఉండాల్సిందే అని వైద్యులు చెప్పారని అభిషేక్ స్వయంగా ట్వీట్ చేశాడు. అమితాబ్ పెద్ద వయస్కుడు కాబట్టి జాగ్రత్త కోసం ఆసుపత్రిలోనే పెట్టి ఉండొచ్చు. కానీ అభిషేక్ ఎందుకు ఆసుపత్రిలోనే ఉంటున్నాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఐతే అతడికి దగ్గు, జ్వరం ఉన్నాయని.. అవి నియంత్రణలోకి వచ్చాక ఇంటికి పంపాలని వైద్యులు నిర్ణయించారని, ఆందోళన ఏమీ అక్కర్లేదని బచ్చన్ కుటుంబ వర్గాలు తెలిపాయి. అమితాబ్ నెగెటివ్ వచ్చే వరకు ఆసుపత్రిలోనే ఉండి, ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు.
This post was last modified on July 13, 2020 5:54 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…