టాలీవుడ్ హీరో నాగశౌర్య కూడా త్వరలోనే పెళ్లి కొడుకుగా కనిపించబోతున్నాడు. గతంలోనే ఇతని పెళ్లి గురించి అనేక రకాల కథనాలు అయితే వెలుపడ్డాయి. అంతేకాకుండా నాగశౌర్య కూడా పలు సినిమాల ఇంటర్వ్యూలలో కూడా ఈ ఏడాది చివరిలో తన పెళ్లి అవుతుంది అని కూడా తెలియజేశాడు. ఇక ఇప్పుడు అతను పెళ్లికి సంబంధించిన పనుల్లో బిజీ అవుతున్నాడు.
పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. నవంబర్ 20వ తేదీన ఆదివారం రోజు నాగశౌర్య, అనూషను పెళ్లి చేసుకోబోతున్నాడు. అనూష వారి బంధువుల అమ్మాయి అని తెలుస్తోంది. గత ఏడాది నుంచి నాగశౌర్య పెళ్లికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నాడు. ఇక అచ్చమైన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలలో కూడా తెలియజేసిన నాగశౌర్య ఇప్పుడు మొత్తానికి ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఇక నాగశౌర్య – అనూష పెళ్లి హిందు సాంప్రదాయం ప్రకారం బెంగుళూరులోని JW మర్రివుట్ అనే ప్రముఖ హోటల్ లో జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబాలకు సంబంధించిన అతికొద్దిమంది బంధువులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఇక నాగశౌర్యకు క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరు కావచ్చు అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత మరొక రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేయడంలోని నాగశౌర్య కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు.
This post was last modified on November 10, 2022 2:38 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…