దసరా హాలిడేస్‌కు ఇంటికెళ్ళిన సూపర్‌స్టార్ మహేష్ ఆ తరువాత తన తల్లి చనిపోవడంతో షూటింగ్‌కు దూరమయ్యామడు. కాని నెల తరువాత కూడా ఇప్పుడు #SSMB28 షూటింగ్ మొదలుపెట్టడానికి కుదరట్లేదు. స్ర్కిప్ట్ సెట్టవ్వలేదని, యాక్టర్లు దొరకలేదని.. ఎన్ని న్యూస్‌లు వినబడుతున్నా కూడా, రీజన్ ఏంటో స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ టీమ్ కూడా బయటకు చెప్పట్లేదు. అయితే ఇప్పుడు మాత్రం సాలిడ్‌గా ప్రొడక్షన్ సభ్యుల నుండి ఒక మాట వినిపిస్తోంది.
నవంబర్ నెలలో కూడా #SSMB28 మొదలయ్యే ఛాన్సులేదని తెలుస్తోంది. ఒక ప్రక్కన ఇతర తారాగణం తాలూకు డేట్స్ లేకపోవడంతో ఒక ప్రాబ్లమ్ అయితే, మరో ప్రక్కన డస్కీ బ్యూటి పూజా హెగ్డే కూడా లిగమెంట్ బ్రేక్ అవ్వడంతో బెడ్ రెస్ట్ తీసుకుంటోంది. దానితో ఏ విధంగానూ మహేష్ బాబు సినిమాను త్రివిక్రమ్ సెట్స్ మీదకు తీసుకెళ్ళలేకపోతున్నాడట. ఏదేమైనా కూడా డిసెంబర్ మొదటి వారం తరువాతనే సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. పైగా మ్యూజిక్ కు సంబంధించిన పనులు కూడా పూర్తవ్వలేదట. థమన్ ఆల్రెడీ కొన్ని బాణీలు ఇచ్చేశాడు కాని, అవి మహేష్‌కు నచ్చకపోవడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ ఆ పనిలో నిమగ్నమయ్యాడట.
మొన్నటివరకైతే రాజమౌళి సినిమాను వెంటనే స్టార్ట్ చెయ్యాలి కాబట్టి మహేష్ తొందరపడుతున్నాడని అనుకున్నారు. కాని రాజమౌళి సినిమాను 2024 వరకు సెట్స్ తీసుకెళ్లే ఛాన్స్ లేదని క్లారిటీ రావడంతో, సూపర్‌స్టార్ కూడా కాస్త స్లోగానే ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడని అనుకోవచ్చేమో.
This post was last modified on November 10, 2022 9:11 am
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…