జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే మొదటిసారి అభిమానులు బాగా అసహనంతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా కొత్త సినిమా మొదలుకాకపోవడం దీనికి కారణం. మొన్న వీళ్లకు ఊరడించడానికే దర్శకుడు కొరటాల శివ కెమెరామెన్ రత్నవేలు ఉన్న డిస్కషన్ ఫోటోలు బయటికి వదిలారు కానీ వాటి వల్ల చిన్న కదలిక తప్ప ఆశించిన ఉత్సాహమైతే ఇంకా రాలేదు. ఎప్పుడైతే తారక్ సెట్లో అడుగు పెడతారో అప్పటి నుంచి ఫాన్స్ కౌంట్ చేసుకోబోతున్నారు. టీమ్ ప్రస్తుతం లొకేషన్ల కోసం గోవా వెళ్లినట్టు సమాచారం. ఇంకో నెలలోపు మొత్తం వీటితో సహా క్యాస్టింగ్ ని కూడా ఫైనల్ చేయాల్సి ఉంటుంది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ 30 రిలీజ్ డేట్ ని ముందే టార్గెట్ గా పెట్టుకున్నారట. దసరాను లక్ష్యంగా చేసుకుని అక్టోబర్ మూడో వారంలో రిలీజ్ చేయడం గురించి ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఆలూ లేదూ చూలు లేదు సామెత చెప్పినట్టు ఏంటీ తొందరని అనిపిస్తుంది కానీ ఒక్కసారి చిత్రీకరణ మొదలయ్యాక ఖచ్చితంగా అయిదు నెలలలోపే షూట్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ ని సిద్ధం చేసినట్టు తెలిసింది. దానికి తగ్గట్టే జూనియర్ బాడీ మేకోవర్ తో పాటు హెయిర్ స్టైల్ గట్రా మార్చి సిద్ధం కాబోతున్నాడు. విజయదశమి 24వ తేదీ మంగళవారం వస్తుంది. దానికి ముందే అంటే 20నే థియేటర్లలో అడుగుపెడితే రన్ బాగుంటుంది.
ఇవన్నీ ఓకే కానీ హీరోయిన్ మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంతకీ ఎవరు ఎస్ చెబుతారో అంతు చిక్కడం లేదు. జాన్వీ కపూరని ఒకసారి లేదు సాయిపల్లవిని అడిగారని మరోసారి లేదు ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి దిశా పటాని లేదా కియారా అద్వానీని ట్రై చేస్తున్నారని మరోసారి ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు కానీ యూనిట్ నుంచి కనీసం లీక్ కూడా బయటికి రావడం లేదు. ఇది ఫిక్స్ అయితే కానీ ముందుకు వెళ్లలేని పరిస్థితి. అలియా భట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది కానీ ఓ రెండు నెలలు ఆగితే తనూ అందుబాటులోకి వస్తుంది. చూడాలి మరి ఏం చేయబోతున్నారో.
This post was last modified on November 10, 2022 8:54 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…