యన్.టి.ఆర్ బయోపిక్‌కు సంబంధించి రెండు సినిమాలకు తోడు రూలర్ కూడా డిజాస్టర్ కావడంతో రెండేళ్ల ముందు నందమూరి బాలకృష్ణ పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించింది. కెరీర్లో ఆ దశ నుంచి ఆయన పుంజుకోవడం కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అఖండ మూవీతో బాలయ్య మామూలుగా బౌన్స్ బ్యాక్ కాలేదు.
అదే సమయంలో అన్‌స్టాపబుల్ షో బాలయ్య క్రేజ్‌ను అమాంతం పెంచింది. ఇప్పుడు క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న వీరసింహారెడ్డికి బంపర్ క్రేజ్ కనిపిస్తుండగా.. దీని తర్వాత అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌తో ఓ సినిమా ఖరారైంది. ఆ తర్వాత కూడా బాలయ్య కోసం కొన్ని క్రేజీ కాంబినేషన్లు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటిగా తెరపైకి రాబోతున్న కాంబో అందరికీ షాక్ ఇచ్చేలాగే ఉంది.
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో అభిరుచిని చాటుకున్న వెంకటేష్ మహా.. బాలయ్యతో జట్టు కట్టబోతున్నట్లు సమాచారం. ఇటీవల ఊర్వశివో రాక్షసివో ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా బాలయ్య మీద తన అభిమానాన్ని చాటుకుంటూ ఆయనతో సినిమా చేయాలని చూస్తున్నట్లు చెప్పాడు వెంకటేష్ మహా.
ఐతే మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన బాలయ్యతో వెంకటేష్‌కు ఏం సెట్టవుతుందిలే అనుకున్నారంతా. ఈ కాంబో వర్కవుట్ అవుతుందని అనిపించలేదు. కానీ నిజంగానే వెంకటేష్.. బాలయ్యతో సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. బాలయ్యకు లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వారాహి చలనచిత్రం బేనర్లో ఈ సినిమా తెరకెక్కనుందట. వెంకటేష్ సినిమా అంటే బాలయ్య ఏదో ప్రయోగానికి రెడీ అవుతున్నట్లే భావించాలి. ఈ సినిమా చేయాలని బాలయ్య ఫిక్సయి ఉంటే అది సంచలన నిర్ణయం అనే చెప్పాలి.
This post was last modified on November 9, 2022 10:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…