ఈ ఏడాది ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన సినిమాల్లో ‘DJ టిల్లు’ ఒకటి. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అనిపించుకున్న ఈ సినిమాకు ‘టిల్లు 2’ టైటిల్ తో సీక్వెల్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ మొదలైన ఈ సీక్వెల్ ముందు ఇప్పుడు మూడు రిస్కులు ఉన్నాయి. DJ టిల్లు సినిమాకు హీరో సిద్దు జొన్నలగడ్డ వన్ ఆఫ్ ది రైటర్. డైలాగ్స్ అన్నీ సిద్దువే. కాకపోతే దర్శకుడు విమల్ కృష్ణ ఆ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. సిద్దు యాక్టర్ గా ఎంత బెస్ట్ ఇచ్చినా, డైలుగులతో మెప్పించినా దర్శకుడి కి కూడా సక్సెస్ లో కీలక భాగం ఇవ్వాల్సిందే. ఇప్పుడు సీక్వెల్ కి దర్శకుడు మారడం టిల్లు 2 పెద్ద రిస్క్ గా కనబడుతుంది. DJ టిల్లు సక్సెస్ తో సిద్దు కి కాన్ఫిడెన్స్ వచ్చి ఉండొచ్చు కానీ ఈ సీక్వెల్ ను దర్శకుడు మల్లిక్ రామ్ ఎలా తెరకెక్కిస్తాడా ? అనే ఆసక్తి ఆడియన్స్ లో ఉంది .
ఇక టిల్లు స్కేర్ ముందున్న మరో రిస్క్ హీరోయిన్. అవును DJ టిల్లు లో హీరో సిద్దు తర్వాత తన యాక్టింగ్ తో హైలైట్ గా నిలిచింది నేహా శెట్టి. కన్నింగ్ కేరెక్టర్ లో మంచి నటన కనబరిచి రాధిక గా అందరికీ గుర్తుండిపోయింది. ఇప్పుడు సీక్వెల్ లో నేహ కి బదులు అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నారు. అనుపమ తన పాత్రతో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా ? అంటే అనే డౌట్ అందరిలో ఉంది. సీక్వెల్ లో కూడా హీరోయిన్ పాత్ర కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుంది. మరి నేహా ని మైమరిపించేలా అనుపమ నటించగలదా ?
ఈ సీక్వెల్ కి సంబంధించి మూడో రిస్క్ మ్యూజిక్. DJ టిల్లు టైటిల్ సాంగ్ కంపోజ్ చేసిన రాం మిర్యాల ను ఇప్పుడు సీక్వెల్ కి ఫుల్ ఫ్లేడ్జ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. టైటిల్ సాంగ్ పెద్ద హిట్టే కానీ ఆ ఆల్బంలో శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసిన మిగతా పాటలు కూడా మెప్పించాయి. ముఖ్యంగా పటాస్ పిల్లా సాంగ్ సినిమా రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అయింది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆ సినిమాకు హెల్ప్ అయింది. ఇప్పుడు సీక్వెల్ పోస్టర్ లో తమన్ పేరు కనిపించలేదు. అంటే శ్రీచరణ్ మ్యూజిక్ , తమన్ స్కోర్ లేకుండా ఈసారి మొత్తం రామ్ మిర్యాల మీదే మ్యూజిక్ భారం పడనుంది. ఇది కూడా ఒకరకంగా పెద్ద రిస్కే. సినిమా వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ అంటూ ప్రకటించారు. ఎనౌన్స్ మెంట్ టీజర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి. కానీ ఈ రిస్కులన్నీ తీసుకొని సిద్దు మళ్ళీ ఆ మేజిక్ రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ కొడతాడా ? లెట్స్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on November 14, 2022 10:20 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…