టాలీవుడ్ చరిత్రలోనే తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన కథానాయికల్లో సమంత ఒకరు. ఐతే ఈ ఫాలోయింగ్ కేవలం తన సినిమాల వల్ల రాలేదు. సగం క్రెడిట్ సినిమాలకు ఇస్తే.. సగం ఆమె వ్యక్తిత్వానికి ఇవ్వాలి. తన చిలిపితనం.. తన దృఢమైన వ్యక్తిత్వం.. తన సేవాభావం తెలుగు వారికి ఆమెను మరింత దగ్గర చేశాయి. వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకులు ఎదురైనపుడు ఆమె బలంగా నిలబడే తీరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఇటీవల మయోసైటిస్ అనే అనారోగ్య సమస్య తలెత్తితే.. దాని గురించి దాచి పెట్టకుండా అందరికీ వెల్లడించింది. అంతే కాక ఈ దశను అధిగమించి మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతురాలినవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటూనే తన కొత్త చిత్రం ‘యశోద’ కోసం యాంకర్ సుమతో కలిసి ఆమె ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం.
ఈ పరిస్థితుల్లోనూ సినిమా కోసం ఆమె చూపిస్తున్న కమిట్మెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ సమంత ఉద్వేగానికి గురైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న తీరు చూసి అభిమానులకు కూడా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ఓవైపు ఉద్వేగానికి గురవుతూనే.. మరోవైపు తన అనారోగ్యం గురించి యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న అరాచకాలపై సమంత చమత్కరించడం విశేషం. ఒక్కో రోజు ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితిని తాను ఎదుర్కొన్నానని.. కానీ అంతలోనే ఆశ కోల్పోకుండా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నానని సమంత చెప్పింది. ఈ మాట చెబుతూ సమంత కన్నీళ్లు పెట్టుకుంది.
జీవితంలో ఇలాంటివి మామూలే అని చెప్పిన సమంత.. తనకు వచ్చిన వ్యాధి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైనదే అయినప్పటికీ.. తాను మాత్రం ఆ స్థితిలో లేనని స్పష్టం చేసింది. అందరూ తన గురించి హెడ్డింగ్‌లు పెడుతున్నట్లు.. తానేమీ చనిపోయే స్థితిలో లేనని చెబుతూ.. ‘‘నేనింకా చావలేదు’’ అని నవ్వేసింది సమంత. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on November 8, 2022 1:21 pm
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు…
వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు.…