ఈ మధ్య ఏదైనా సినిమాకు పాజిటివ్ టాక్ లేదా మంచి రివ్యూలు వచ్చినంత మాత్రాన వసూళ్లు అంతే ఘనంగా ఉంటాయన్న గ్యారెంటీ ఉండటం లేదు. ఉదాహరణకు గత నెల దసరాకి విడుదలైన చిరంజీవి గాడ్ ఫాదర్ మొదటి నాలుగు రోజులు మాములు రచ్చ చేయలేదు. నిజంగానే బాస్ ఈజ్ బ్యాక్ అనేలా పండగ వసూళ్లు అదరగొట్టాయి. తొంబై కోట్ల టార్గెట్ ఈజీనే అనుకున్నారు. తీరా చూస్తే యాభై దాటడం ఆలస్యం రెండో వారానికే విపరీతంగా స్లో అయిపోయి ఫైనల్ గా హిట్టో ఫట్టో చెప్పలేని అయోమయంలోకి తీసుకెళ్లింది. మొత్తంగా చూస్తే ఆచార్య కంటే అన్ని కోణాల్లో వందరెట్లు నయమనే సంతృప్తిని మిగిల్చింది.
ఇప్పుడు అల్లుడు అల్లు శిరీష్ కీ ఇదే సమస్య వచ్చి పడింది. శుక్రవారం రిలీజైన ఊర్వశివో రాక్షసివోకి టాక్ బాగుంది. మీడియా సపోర్ట్ దక్కింది. నవ్వించి టైం పాస్ చేయించి స్పెషల్ రొమాన్స్ ని చక్కగా దట్టించి ఎంటర్ టైన్ చేశారనే రిపోర్ట్స్ గీతా ఆర్ట్స్ టీమ్ కి ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీంతో అప్పటికప్పుడు ఒక్క రోజులో సక్సెస్ మీట్ కి కావాల్సిన ఏర్పాట్లు చేసి అల్లు అర్జున్ ని ముఖ్య అతిధిగా తీసుకొచ్చి హైప్ ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ వేడుకలో బన్నీ నామస్మరణ ఎక్కువవడంతో అసలు టార్గెట్ పక్కకెళ్లిన మాట కూడా వాస్తవం.
ఇక వసూళ్ల విషయానికి వస్తే ఈ ఊర్వశివో రాక్షసివో కలెక్షన్లు మరీ జెట్ స్పీడ్ తో ఏం లేవు. వీకెండ్ కి కనీసం ఓ రెండు కోట్ల షేర్ వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందనుకోవచ్చు. కానీ కోటిన్నర కూడా టచ్ చేయలేకపోయిందని ట్రేడ్ న్యూస్. వీక్ డేస్ లో సహజంగానే డ్రాప్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు పెద్దగా అద్భుతాలు జరగవు. సండే రోజు కాంతార హౌస్ ఫుల్ అయిన చాలా చోట్ల శిరీష్ సినిమాకు టికెట్లు దొరికాయి. మిగిలిన వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలే శుక్రవారం యశోద, వాకండా ఫరెవర్ లతో కాంపిటీషన్ టఫ్ గా ఉంది. మరి అల్లు బ్రదర్ ఎలా నెట్టుకొస్తాడో.
This post was last modified on November 8, 2022 6:28 am
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…