సంక్రాంతి రేసులో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముందు రిజర్వ్ చేసుకున్న ఆది పురుష్ ఫస్ట్ తప్పుకోగా తాజాగా ఏజెంట్ కూడా పండగ బరిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. నిర్మాత అనిల్ సుంకర ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు పోస్ట్ పోన్ అయినట్టేనని, మొన్న వదిలిన పోస్టర్ ముందస్తు జాగ్రత్త తప్పించి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలన్న గ్యారెంటీతో కాదట. మహాశివరాత్రిని టార్గెట్ చేసుకుంటే సోలో కాంపిటీషన్ తో పాటు మంచి రన్ దక్కే అవకాశం కనిపిస్తోంది కనుక దానికే మొగ్గు చూపొచ్చని వినికిడి.
అలా జరిగితే ఏజెంట్ తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే అవుతుంది. పైగా వాల్తేర్ వీరయ్య, వీరసింహా రెడ్డి లాంటి మాస్ బొమ్మలను తట్టుకుని ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ నిలవడం అంత సులభం కాదు. ఎందుకంటే బిసి సెంటర్స్ లో గన్నులు పట్టుకుని ఫారిన్ లో తిరిగే హీరో కన్నా పంచలు కట్టుకుని ఊళ్ళో విలన్ల భరతం పట్టే ఊర మాస్ చిరు బాలయ్యకే మాస్ జనం ఎక్కువ మొగ్గు చూపుతారు. అందులోనూ ఇవి ప్యాన్ ఇండియా కాకపోయినా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఉంది. థియేటర్లు తగ్గడం ఏజెంట్ కు ఎంత మాత్రం సేఫ్ గేమ్ కాదు.
ఇదొక ఎత్తయితే తమిళంలో విజయ్ వారసుడు, అజిత్ తునివులకే అక్కడి స్క్రీన్లు చాలక డిస్ట్రిబ్యూటర్లు కొట్టుకునే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ప్యాన్ ఇండియా ఏజెంట్ కి కొన్ని ఇవ్వండంటే సమస్యే లేదని వెళ్లిపొమ్మంటారు. మమ్ముట్టి లాంటి బ్యాక్ పెట్టుకుని ఇలాంటి రిస్కులు చేయడం కరెక్ట్ కాదు. అఖిల్ సినిమా ఎప్పుడు వచ్చినా మల్టీ లాంగ్వేజెస్ లో వీలైనంత సోలో రిలీజ్ దక్కించుకోవడం అవసరం. అందుకే అన్నీ అలోచించి ఏజెంట్ ని ఫెస్టివల్ ట్రాక్ నుంచి తప్పించారనే టాక్ ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సక్సెస్ కు అఖిల్ కు మార్కెట్ పరంగా చాలా కీలకం.
This post was last modified on November 7, 2022 10:55 am
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…