Movie News

ఊర్వశివో రాక్షసివో.. భలే మేనేజ్ చేశారే

గతంలో మాదిరిగా విదేశీ చిత్రాలను సైలెంటుగా కాపీ కొట్టేసి ఇప్పుడు సినిమాలు తీసేసే పరిస్థితి లేదు. వరల్డ్ సినిమా అందరికీ అందుబాటులోకి వచ్చేసిన నేపథ్యంలో ఫ్రీమేక్‌లు తీస్తే అడ్డంగా బుక్ అవ్వాల్సిందే. ఇక రీమేక్ సినిమాల విషయంలోనూ ఇంతకుముందులా దాపరికాలు పాటించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదో భాష నుంచి రీమేక్ హక్కులు తీసుకుని, ఆ విషయం చెప్పకుండా జనాలను మభ్యపెట్టి సినిమాలు రిలీజ్ చేయడం కూడా కష్టంగానే ఉందిప్పుడు.

చిన్న ఫ్రేమ్ చూసి ఇది ఫలానా భాషలో ఫలానా సినిమాకు రీమేక్ అనే విషయాన్ని జనం కనిపెట్టేస్తున్నారు. అందుకే రీమేక్ సినిమాలు చేసే వాళ్లు.. ముందే అసలు విషయం చెప్పేస్తున్నారు. ఐతే అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు తీసి ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కలిగించడం, సినిమాలను హిట్ చేయడం సవాలుగా మారిపోతోంది.

కానీ ‘ఊర్వశివో రాక్షసివో’ టీం మాత్రం ఈ విషయంలో భలే తెలివిగా వ్యవహరించింది. ఈ చిత్రం రీమేక్ అన్న విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. స్ట్రెయిట్ సినిమాలాగే ప్రచారం చేసింది. నిజానికి ఇది ‘ప్యార్ ప్రేమ కాదల్’ అనే తమిళ హిట్ మూవీకి రీమేక్. అక్కడ దీన్నొక బి-గ్రేడ్ బోల్డ్ మూవీలా చూశారు. యూత్ బాగా అట్రాక్ట్ అయి హిట్ చేశారు.

ఏదైనా పాపులర్, పెద్ద సినిమాను రీమేక్ చేసి ఉంటే దాని గురించి పెద్ద చర్చ జరిగేది. కానీ దర్శకుడు రాకేశ్ శశి ‘ప్యార్ ప్రేమ కాదల్’ లాంటి చిన్న స్థాయిలో బోల్డ్ మూవీని ఎంచుకుని, ఇక్కడ పేరున్న ఆర్టిస్టులతో ప్యాడింగ్ పెట్టుకుని, బోల్డ్ కంటెంట్ డోస్ ఏమాత్రం తగ్గించకుండానే యూత్ బాగా కనెక్టయ్యేలా వినోదాన్ని జోడించి సినిమా రేంజ్ పెంచాడు. ఇదొక రీమేక్ అన్న చర్చే లేకుండా చేయడంలో చిత్ర బృందం విజయవంతం అయింది. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజు సాయంత్రం నుంచి బాగా పుంజుకుని మంచి వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది.

This post was last modified on November 6, 2022 8:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

14 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

51 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago