‘బాహుబలి’ తర్వాత సాహో, రాధేశ్యామ్ చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచినప్పటికీ ప్రభాస్ జోరేమీ తగ్గలేదు. వరుసగా భారీ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఆదిపురుష్ చిత్రాన్ని గత ఏడాదే పూర్తి చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’తో పాటు ‘ప్రాజెక్ట్-కే’, మారుతి సినిమాల్లో సమాంతరంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంత పెద్ద హీరో ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కాగా ప్రభాస్ నాలుగో సినిమా సైతం ఎప్పుడో ఖరారైంది.
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే సినిమాను గత ఏడాదే అనౌన్స్ చేశారు. కానీ అది 2024లో కానీ సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. చేతిలో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. మధ్యలోకి మారుతి సినిమాను తీసుకురావడమే వారికి నచ్చలేదు.
అలాంటిది ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఇంకో సినిమా అంటూ చర్చ మొదలైంది. ఐతే ఈ చర్చ కొత్తదేమీ కాదు. గతంలోనే దీని గురించి చర్చ జరిగింది. బాలీవుడ్లో యాక్షన్ సినిమాల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా కమిటైనట్లుగా మళ్లీ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ సినిమా తీస్తున్న సిద్దార్థ్‌కు బాలీవుడ్లో మంచి డిమాండే ఉంది. ‘వార్’తో అతను మెగా హిట్ ఇచ్చాడు. ‘పఠాన్’ సైతం అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.
సిద్దార్థ్‌తో ప్రభాస్ సినిమా చేస్తే బాగానే ఉంటుంది కానీ.. అసలు ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటినీ పూర్తి చేసి ఎప్పటికి ఫ్రీ అవుతాడన్నది చూడాలి. చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయకుండా కొత్తగా ఒక్కొక్కటి కమిటవుతూ వెళ్లడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఐతే ఆలూ లేదు చూలూ లేదు అన్నట్లు ఈ సినిమాకు గాను సిద్దార్థ్ రూ.80 కోట్ల పారితోసకం పుచ్చుకోబోతున్నట్లు అప్పుడే ప్రచారం జరిగిపోతుండడమే విడ్డూరం.
This post was last modified on November 7, 2022 9:19 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…