టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్ అనుకోకుండా మరో వివాదంలో చిక్కుకున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో మొదలైన సినిమాలో కథానాయకుడిగా ఖరారైన అతను.. కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ సినిమాకు కాల్ షాట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని అర్జున్ ఈ విషయమై హైదరాబాద్‌కు చేరుకుని విశ్వక్ మీద ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు ఫిర్యాదు చేయడమే కాక.. ప్రెస్ మీట్ పెట్టి అతడి మీద తీవ్ర ఆరోపణలు చేశాడు.
సెట్స్ వేసుకుని, నటీనటులందరి కాల్ షీట్స్ సంపాదించి, షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్ల చేసుకున్నాక మూడుసార్లు విశ్వక్ షూట్ క్యాన్సిల్ చేయించాడని.. ఇలాంటి అన్ ప్రొఫెషనల్ నటుడితో సినిమా చేయబోనని అర్జున్ ఆవేదన స్వరంతో చెప్పాడు. కథ నచ్చి సినిమా ఒప్పుకున్నాక విశ్వక్ కథలో కరెక్షన్లు చెప్పడం.. అలాగే డైలాగ్స్, పాటల విషయంలో అభ్యంతరాలు చెప్పడం గురించి అర్జున్ ప్రస్తావించాడు. ఐతే దీనిపై విశ్వక్ ఎలా స్పందిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతనైతే ప్రస్తుతానికి సైలెంటుగా ఉన్నాడు.
ఐతే విశ్వక్ టీం చెబుతున్న దాని ప్రకారం.. స్వయంగా రచయిత, దర్శకుడు అయిన విశ్వక్ షూట్ జరుగుతున్న టైంలో కథలో కొన్ని లోపాలు గుర్తించి మార్పులు చేర్పులు సూచించాడని, కానీ అర్జున్ అవేమీ స్వీకరించకుండా తాను చెప్పినట్లే చేయాలని కండిషన్లు పెట్టడంతో విశ్వక్ ఇగో హర్టయి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నాడని అంటున్నారు. ఈ సినిమా తనకు ఉపయోగపడదని అతను ఫీలైనట్లుగా చెబుతున్నారు. కానీ ఈ వాదన అంత సమంజసంగా అయితే అనిపించడం లేదు.
విశ్వక్ దీనిపై మీడియాతో మాట్లాడి తన వాదనను బలంగా వినిపిస్తే తప్ప విమర్శలు తప్పకపోవచ్చు. ఆదివారం ఒక సినిమా టీజర్ లాంచ్ కోసం హైదరాబాద్ ఏఎంబీ మాల్‌కు వస్తున్న విశ్వక్.. అక్కడేమైనా మీడియాకు దీనిపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on November 6, 2022 8:18 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…