Movie News

అవతార్-2తో కలిసి రానున్న పుష్ప

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ కావాలంటే రాజమౌళితోనే సినిమా చేయాల్సిన అవసరం లేదని చాటి చెప్పాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ మూవీతో అతను అనూహ్యంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తెలుగేతర భాషల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్నందుకుంది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా ఏకంగా వంద కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టి అక్కడి ట్రేడ్ పండిట్లను షాక్‌కు గురి చేసింది.

ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్ వరల్డ్ లెవెల్లో పాపులర్ అయ్యాయి. మెడ కింద చెయ్యి పెట్టి తగ్గేదేలే అంటూ చెప్పే డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. ఈ పాపులారిటీ ‘పుష్ప-2’ బిజినెస్‌కు బాగా కలిసొస్తోంది. ఈ సినిమాకు ఉన్న హైప్‌ను ఇంకా పెంచేందుకు ముందు నుంచి మార్కెటింగ్ గట్టిగా చేయడానికి రెడీ అవుతోంది చిత్ర బృందం. ఒక బ్యాంగ్ బ్యాంగ్ వీడియో ప్రోమోతో ‘పుష్ప-2’ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడట సుకుమార్.

నేరుగా ‘పుష్ప-2’ టాకీ పార్ట్ చిత్రీకరణ మొదలుపెట్టకుండా.. టీజర్ గ్లింప్స్ కోసం విజువల్స్ తీయబోతున్నాడట సుకుమార్. ఇంకొన్ని రోజుల్లోనే రామోజీ ఫిలిం సిటీలో ఈ షూట్ జరగబోతోంది. కొన్ని రోజుల పాటు ఈ షాట్స్ చిత్రీకరించి.. దాన్ని ఎడిటింగ్‌కు పంపించి ఆ తర్వాత రెగ్యులర్ షూట్‌లోకి వెళ్లనున్నారట.

‘పుష్ప-2’ టీజర్ గ్లింప్స్‌ను ‘అవతార్-2’ రిలీజ్ రోజు వరల్డ్ వైడ్ వీలైనంత మేర ఆ సినిమా ఆడే థియేటర్లలో ఇంటర్వెల్‌లో ప్రదర్శించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దాదాపు 25 భాషల్లో ఈ టీజర్ గ్లింప్స్ లాంచ్ చేయబోతున్నారట. ‘పుష్ప-2’ సినిమాకు ఇది బ్యాంగ్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఒకేసారి సినిమా మీద హైప్ మరిన్ని రెట్లు పెరిగేలా సుకుమార్ ఈ టీజర్ గ్లింప్స్‌ను తీర్చిదిద్దడంతో పాటు దీని రీచ్ ఒక రేంజిలో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకు రిలీజయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

This post was last modified on November 4, 2022 4:30 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

2 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago